By: ABP Desam | Updated at : 27 Jan 2022 03:51 PM (IST)
ఉద్యోగులు ఎప్పుడొచ్చినా అపోహలు తొలగిస్తామన్న సజ్జల
ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ఉన్న అపోహలన్నింటినీ తొలగించడానికి అవసరం అయితే నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ఏర్పాటయిన కమిటీ మరోసారి సమావేశం అయింది. ఆయితే ఉద్యోగులు ఎవరూ హాజరు కాలేదు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవడం, వచ్చే నెల పాత జీతాలే ఇవ్వడం వంటి కండిషన్లను అమలు చేస్తేనే తాము చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు సమాచారం ఇచ్చారు. దీంతో వారి కోసం కాసేపు ఎదురు చూసి ఆ తర్వాత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉద్యుగులను పిలిచి చర్చల కోసం ఎదురు చూసినా వారు రాకపోవడం దురదృష్టకరమన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉద్యోగుల కోసం ఎదురు చూసాం. వ్యక్తిగతంగా కూడా రమ్మని పిలిచాం. ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుంది. టీవీల ద్వారా పరిష్కారం జరగదు. సమ్మె చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. సమ్మె వరకూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
రేపటి నుండి కూడా మేము అందుబాటులో ఉంటాము. ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తాం. వాళ్ళు శత్రువులు కాదు.. మా ఉద్యోగులేనని సజ్జల వ్యాఖ్యానించారు. చర్చలకు రాకుండా షరతులు పెట్టడం సమంజసం కాదన్నారు. పే స్లిప్‌లు వస్తే ఎంతపెరిగిందో.. ఎంత తగ్గిందో తెలుస్తుందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు రాకపోయినా తాము ప్రతీ రోజూ అందుబాటులో ఉంటామని.. మనసు మార్చుకుని ఎప్పుడైనా చర్చలకు రావొచ్చని సూచించారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఆందోళనలకు దిగడంతో వారికి నచ్చ చెప్పేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదని మొదట ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు... తర్వాత ప్రభుత్వం అధికారికంగా జీవో ఇచ్చింది. అయితే ముందు జీవోలు వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
చర్చలకు సిద్ధమంటున్న ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు అడుగుతున్న ఒక్క డిమాండ్‌ను కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా లేదు. కనీసం పరిశీలిస్తామని కూడా చెప్పడం లేదు. అపోహలు తొలగిస్తామని మాత్రమే చెబుతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు చర్చలకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప్రభుత్వం కూడా తాము ఆహ్వానించాం.. వారు రావడం లేదు అన్న భావన కల్పించడానికే చర్చల ప్రక్రియ నడిపిస్తున్నారు కానీ.. నిజంగా వారిని సమ్మె యోచన విరమించేలా చేసే ఆలోచనలో లేరని ఉద్యోగ సంఘ నేతలు విమర్శిస్తున్నారు.
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
NTR Centenary Celebrations : పురోహితునిగా ఎన్టీఆర్ - సినిమాలో కాదు నిజంగా !
Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం
Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్ సిలిండర్ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !
Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్