అన్వేషించండి

Russia Tour Row : ఏపీ రాజకీయాల్లో "రష్యా పార్టీ" హాట్ టాపిక్..! మంత్రి బాలినేనితో పాటు వెళ్లిన వారెవరు..? ఎవరు ఖర్చులు పెట్టుకున్నారు..?

మంత్రి బాలినేని రష్యా పర్యటన వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే కూడా తనతో ఉన్నారని బాలినేని లీక్ చేశారు. దాంతో ఎవరెవరు వెళ్లారన్న డిబేట్ ప్రారంభమయింది.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న విషయం మంత్రి బాలినేని శ్రీనివాస్ రె‌డ్డి  ప్రత్యేక విమానంలో రష్యా వెళ్లడం. ఈ పర్యటనపై రాజకీయం దుమారం రేగడంతో ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. మంత్రి బాలినేని వెళ్లింది అధికారిక పర్యటన కాదని వ్యక్తిగత పర్యటన మాత్రమేనని చెబుతున్నారు. ఓ ఉన్నత స్థాయి వ్యక్తి పుట్టిన రోజు వేడుకల కోసం 17 మంది తనకు అత్యంత సన్నిహితులైన ప్రముఖుల్ని ప్రత్యేక విమానంలో రష్యాకు తీసుకెళ్లారని తెలుస్తోంది. వారిలో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 
బాలినేని స్పెషల్ రష్యా టూర్‌పై టీడీపీ విమర్శలు
మూడు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫేస్‌బుక్‌ పేజీలో  ప్రత్యేక విమానంలో రష్యాకు ప్రయాణిస్తున్న ఫోటో పెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్లారో.. వెళ్తున్నారో.. లేకపోతే వస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన టీం  రష్యాకు వెళ్తున్నారని సోషల్ మీడియాలోనే చెప్పిది. దీంతో విపక్ష పార్టీలు విమర్శలు ప్రారంభించాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రూ. కోట్లు ఖర్చు పెట్టి అవినీతి సొమ్ముతో విలాసాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతలు విపరీతంగా విమర్శలు చేయడంతో ఈ అంశం రాజకీయ దుమారంగా మారింది.
Russia Tour Row :  ఏపీ రాజకీయాల్లో
తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యే కూడా వచ్చారని బాలినేని లీక్ 
అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి తననే టీడీపీ నేతలు ఎక్స్‌పోజ్ చేస్తూండటంతో అసలు  టీడీపీని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో తనతో పాటు రష్యాకు వచ్చిన వారిలో  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజకీయవర్గాల్లో మరో సంచలనం ప్రారంభమయింది. వైసీపీ మంత్రితో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఎందుకెళ్లారన్న చర్చ ఓ కారణం అయితే.. అసలు వీరందరూ ఎందుకు రష్యా వెళ్లారన్న సందేహం మరో వైపు ప్రజల్లోనూ .. రాజకీయ పార్టీల నేతల్లోనూ ప్రారంభమయింది.

Also Read : కడపలో వజ్రాల గనులు
రష్యా పార్టీకి ప్రత్యేక విమానంలో వెళ్లిన 17 మంది ప్రముఖులు
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తో పాటు మరో పదిహేను మంది రష్యాకు వెళ్లిన ప్రత్యేక విమానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారంతా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ బడా వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అన్ని పార్టీల నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నఆ వ్యాపారవేత్త రాజకీయ నేతలకు ఇలా విలాసాలు రుచి చూపించడంలో ముందు ఉంటారని చెబుతున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలు రష్యాలో ఎవరూ ఊహించని విధంగా చేయాలని నిర్ణయించుకుని తనకు అత్యంత సన్నిహితులైన వారి కోసం ప్రత్యేక విమానం బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రి బాలినేని , ఎమ్మెల్యే సత్యప్రసాద్ కాకుండా ఇంకా ఎవరెవరు ఆ పార్టీకి వెళ్లారన్నదానిపై స్పష్టత లేదు.

Also Read : కోకాపేట భూముల అమ్మకాలపై సీబీఐ
కోట్లు ఖర్చు పెట్టి పుట్టినరోజు జరుపుకున్న ఆ వీఐపీ ఎవరు ? 
అయితే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహా రష్యా వెళ్లిన పదిహేడు మంది రాజకీయ నేతలేనని తెలుస్తోంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా అన్ని పార్టీల కీలక నేతలూ ఆ స్పెషల్ ఫ్లైట్‌లో రష్యాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ కాబట్టి సహజంగా వైసీపీ నేతలే ఎక్కువ ఉంటారు. అయితే  ప్రయాణ చార్జీలకే కోట్లు పెట్టి తీసుకెళ్లిన ఆ బడా వ్యక్తి రష్యాలో పార్టీల కోసం ఇంకెంత ఖర్చు పెట్టారో అన్నది ఊహించడం కష్టం. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా టీం అత్యుత్సాహంతో ఫోటో బయట పెట్టడంతో  బయటకు తెలిసిన రష్యా టూర్ ఎపిసోడ్ ముందు ముందు ఆ స్పెషల్ ఫ్లైట్‌లో రష్యాకు వెళ్లిన 17 మంది ఎవరు .. అక్కడ ఏం చేశారు వంటి విషయాల లీక్ అవడంతోనే ముగిసే అవకాశం ఉంది. 

Also Read : మోహన్ బాబు వర్సెస్ నాగబాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget