అన్వేషించండి

TDP Leaders: 160 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తాం, మహానాడులో టీడీపీ నేతల ధీమా

TDP Leaders: టీడీపీ వార్షిక పండ మహానాడు అట్టహాసంగా సాగుతోంది. వేలాదిగా తరలివచ్చిన శ్రేణులతో పసుపుమయంగా మారింది.

TDP Leaders: రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు అట్టహాసంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మహానాడులో  పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 

160 సీట్లతో టీడీపీ గెలుపు: అచ్చెన్నాయుడు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లను గెల్చుకుని అధికారం చేపడుతుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది ఎప్పుడూ ప్రజాపక్షమేనని పేర్కొన్నారు.  2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారని అచ్చెన్న అన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాంతో సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అప్పట్లో తెలుగు దేశాన్ని ఎదుర్కోలేక జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ ను వేటాడి, వెంటాడి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 151 స్థానాలతోనే సీఎం జగన్ కళ్లు నెత్తికెక్కి, ఒళ్లు మెదమెక్కిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

'దోపిడీ దొంగకు ఓట్లేసి సీఎంను చేయడం చాలా పెద్ద తప్పు'

1982 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదని, 2019లో దురదృష్టవశాత్తూ ఏపీ ప్రజలు ఏమరపాటుతో తప్పు చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఓ కొత్త వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి సేవ చేస్తానంటే నమ్మడంలో అర్థం ఉందని, కానీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి, 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఓ దోపిడీ దొంగను సీఎంను చేయడం చాలా పెద్ద తప్పని అది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. 

'రేపోమాపో హత్య కేసు జగన్ మెడకు చుట్టుకుంటుంది'

ఒకవైపు 5 కోట్ల మంది ప్రజల వ్యతిరేకత, మరోవైపు తరుముకొస్తున్న బాబాయ్ హత్య కేసుతో జగన్ మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రేపోమాపో వివేకా హత్య కేసు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటుందని అన్నారు. ఈ విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని, అదే నిన్న సీబీఐ కోర్టులో చెప్పిందని తెలిపారు. సీబీఐ అడుగు ముందుకేస్తే తన కథ ముగుస్తుందన్న ఆందోళన ముఖ్యమంత్రికి నిద్రలేని రాత్రుళ్లు మిగులుస్తోందని మండిపడ్డారు. 

క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు: కాసాని జ్ఞానేశ్వర్

క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. హైదరాబాద్ ను అదే క్రమశిక్షణతో అభివృద్ధి చేసి దేశంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. ఇటు ఏపీలో, అటు తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ఎలాంటి వార్తలు ప్రసారం చేయలేకపోతోందని, అలా వారిని భయపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో మీడియాకు స్వేచ్ఛ ఉండేదని, దేని గురించి అయినా పేపర్లో వస్తే మరోసారి రాకుండా పనులు పూర్తి చేసేవారని కాసాని పేర్కొన్నారు.

Also Read: TDP Manifesto: ఈసారి సంక్షేమం- అభివృద్ది ప్లస్‌, రేపే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో: చంద్రబాబు

రేపటి మహానాడులో బాబు ఎన్నికల సందేశం: సోమిరెడ్డి

జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ హింసకి సింబల్‌గా మారిపోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అతిపెద్ద నేరపరిశోధన సంస్థ అయిన సీబీఐ.. ఏపీలో నిందితుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఏం అడ్డం వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ హత్యా రాజకీయాలకు సెంటర్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ కళ్యాణ్ కామెంట్లతో జగన్ కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు కడతారా అని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేపటి మహానాడులో చంద్రబాబు ఎన్నికల సందేశం ఇవ్వబోతున్నారని సోమిరెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎలా కాపాడుకోవాలో చంద్రబాబు తన ప్రసంగంలో వివరిస్తారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget