అన్వేషించండి

రాజమండ్రి జైలు సమీపంలో డ్రోన్ ఎగిరింది వాస్తవమే కానీ...! చంద్రబాబు లేఖపై అధికారుల వివరణ

ఈనెల 22న జైలు వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఒక డ్రోన్‌ తిరిగింది. క్లోజ్డ్‌ జైల్‌ వైపు ఆ డ్రోన్‌ రాలేదు. దీనిపై సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చామన్నారు జైళ్ల శాఖ డీఐజీ .

చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌. 24 గంటలూ సెక్యూరిటీతోపాటు అడిషనల్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జైలులో తనకు ప్రాణహాని ఉందని న్యాయమూర్తికి చంద్రబాబు రాసిన లేఖపై రవికిరణ్‌ ప్రెస్‌మీట్ పెట్టారు. 

రవికిరణ్‌ ఇంకా ఏమన్నారంటే... జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్‌ ఉన్నాయి. బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతుంది. ప్రతీ గంటకోసారి గార్డ్‌ సెర్చ్‌ చేస్తున్నాం. ఎస్పీతో మాట్లాడి ప్రత్యేకంగా సెంట్రల్‌ పోలీస్‌ లైన్‌ టీమ్‌తో జైలు చుట్టుపక్కలా పర్యవేక్షణ కూడా చేస్తున్నాం. ఈనెల 22వ తేదీన జైలు వాటర్‌ ట్యాంక్‌ వైపు ఒక డ్రోన్‌ తిరిగింది. ఈ సమాచారం నార్త్‌ఈస్ట్‌ వాచ్‌ టవర్‌ గార్డు అందించారు. అయితే, క్లోజ్డ్‌ జైల్‌ వైపు ఆ డ్రోన్‌ రాలేదు. దీనిపై మేం జైళ్లశాఖ నుంచి అధికారికంగానే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చాం. ఆ తర్వాత జైలుపై ఎలాంటి డ్రోన్స్‌ తిరగలేదు. 

మావోల పేరుతో వచ్చిన లేఖ ఒరిజినల్‌ కాదు. అది నకిలీ లేఖగా గుర్తించామన్నారు కిరణ్. చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లేఖ ఫేక్‌ అని విచారణలో తేలిందన్నారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు అధికారుల అటెస్టేషన్‌ చేయలేదు. జైలులోకి వచ్చే ప్రతీ ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకనే లోపలికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. శ్రీనివాస్‌ అనే ఖైదీని రిమాండ్‌కు తెచ్చినప్పుడు ఆయన వద్ద ఒక బటన్‌ కెమెరా ఉన్నట్లు గుర్తించామని... అయితే వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. దాన్ని తనిఖీ చేయగా అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని.. అతని ఫ్యామిలీ ఫోటోస్‌ రెండు ఉన్నాయన్నారు. తాము స్వాధీనం చేసుకున్న కెమెరాను కూడా పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. దాన్ని రిమాండ్‌ ఖైదీ ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతుందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర్నుంచీ గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరిన దాఖల్లాల్లేవని వివరించారు. అది ఎప్పటికీ జరిగే అవకాశమేలేదన్నారు. 

చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్‌ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించామని.. వారు పరీక్షలు చేశారని రవికిరణ్ వెల్లడించారు. చంద్రబాబుకు ఇమ్మెచ్చ్యూర్‌ కేటరాక్ట్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారన్నారు. కొంత సమయం తర్వాతైనా ఆపరేషన్‌ చేయించుకోవచ్చని వైద్యులు సూచించినట్టు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి తప్పుడు రిపోర్టు బయటకు ఇవ్వలేదన్నారు. ఆయన ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నామని వివరించారు. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహా బ్యారెక్‌లో చంద్రబాబును ఏ రూమ్‌లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించలేమన్నార. జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని... విచారణ కొనసాగుతుందని తెలిపారు. 

చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి ప్రభుత్వ వైద్యులకు చెప్పారని...దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు రాసినట్టు రవికిరణ్‌ వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో సూచనలు ఇవ్వాలని భువనేశ్వరికి కూడా అడిగినట్టు తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టుకు వెల్లడించినట్టు పేర్కొన్నారు. 

రాజమండ్రి ఎస్పీ జగదీష్‌ ఏమన్నారంటే?
రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ బయట వైపు 24 గంటలపాటూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా నిఘా ఉంటుందని జగదీష్‌ తెలిపారు. జైలు చుట్టుపక్కల అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంటిన్యూస్‌ మానిటరింగ్‌ జరుగుతుందన్నారు. మావోయిస్టు లేఖ అనే దానిపై పూర్తిగా లోతైన విచారణ చేయించామని అది ఫేక్‌ లెటర్‌ అని గుర్తించామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget