(Source: ECI/ABP News/ABP Majha)
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దొంతుకుర్రులో విద్యుత్ ప్రమాదం- విద్యార్థి మృతిపై వేళ్లన్నీ కాంట్రాక్టర్, ఉపాధ్యాయులవైపే
పాఠశాలల ప్రాంగణాల్లో నాడు-నేడు భవన నిర్మాణ పనులు, సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టైంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిన ప్రమాదంలో నిర్లక్ష్యమే విద్యార్థి ప్రాణం తీసిందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
బడిలో నిర్మాణ పనులు జరుగుతున్న టైంలో జాగ్రత్తగా ఉండాల్సిన సిబ్బంది అలక్ష్యంగా వ్యవహరించడంతోనే పసిప్రాణం బలైపోయిందని స్థానికంగా వినిపిస్తున్నా మాట. ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం మిగతా విద్యార్థులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.
పాఠశాలల ప్రాంగణాల్లో నాడు-నేడు భవన నిర్మాణ పనులు, సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టైంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జడ్పీ హైస్కూల్లో నిర్లక్ష్యమే అభం శుభం ఎరుగని విద్యార్ధి ప్రాణాం బలిగొంది. సమయానికి సమయస్ఫూర్తితో అక్కడ భవన నిర్మాణ కార్మికులు స్పందించి కర్రలతో విద్యుత్తు షాక్ నుంచి విద్యార్థులను తప్పించారు. కానీ మరింత ఘోరం జరిగిపోయేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఐరెన్ కటింగ్ పనులు చేపట్టడం, అక్కడే ఉండి సక్రమంగా జరగాల్సిన పనులు పర్యవేక్షించాల్సిన సదరు కాంట్రాక్టరు లేకపోవడాన్ని స్థానికులు తప్పుబటుతున్నారు. విద్యార్థులు ఎక్కడికి వెళుతున్నారో అనే పరిశీలన ఉపాధ్యాయుల్లో లేదన్నారు. మొత్తం మీద ఒక విద్యార్థి నిండు ప్రాణం బలిగొనేలా చేసింది వీళ్ల నిర్లక్ష్యమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా..
దొంతికుర్రు గ్రామ సచివాలయ నిర్మాణ పనులు జడ్పీ హైస్కూల్ ప్రాంగణానికి ఆనుకుని చేస్తున్నారు. శ్లాబుకు ఉపయోగించే ఐరెన్ కటింగ్ పనులు పాఠశాల ప్రాంగణంలోనే చేస్తున్నారు. దీనికి విద్యుత్తు సరఫరా కూడా స్కూల్ నుంచే తీసుకున్నారని తెలుస్తోంది. ఐరన్ కోసే పనిముట్లు కోసం తీసుకున్న విద్యుత్తు సరఫరా వైర్లు పలుచోట్ల అతుకులు ఉండడం, వాటిపై వేసిన ఇన్సులేషన్ టేపు పాడై ఆ తీగలు ఐరన్ ఊచలపై పడడంతోనే ఈప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో మంచి నీటి కోసం బయటకు వెళ్లిన విద్యార్థులు అడూతూ పాడుతూ వెళుతూ దారికి అడ్డంగా ఉన్న ఊచలపై అడుగులు వేయగానే విద్యుత్తు షాక్‌కు గురయ్యారని ఇది ముమ్మాటికి కాంట్రాక్టరు నిర్లక్ష్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.
షూలు ఉన్నా విద్యార్ధులకు ప్రమాదం తప్పేది...
నిజానికి సంఘటన జరిగిన సమయంలో అయిదుగురు విద్యార్థులే కాకుండా ఇంకా కొంత మంది ఉన్నారు. అయితే వారిలో ఈ అయిదుగురి కాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన షూలు లేకపోవడంతో ఊచలపై కాలు మోపగానే ప్రమాదం సంభవించింది. విద్యార్థుల కాళ్లకు సరిపడా సైజుల షూలు లేకపోవడం వల్ల కొంత మందికి షూలు ఇవ్వలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. షూలు ధరించిన విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ప్రజా సంఘాల ఆగ్రహం..
పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు, గ్రామ సచివాలయ పనులను స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులే చేపడుతున్నారని, వీరి పలుకుబడితో పిల్లలు చదువుకునే పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్మాణ పనులకు సంబంధించి అన్ని పనులు నిర్లక్ష్యంగా చేపడుతున్నారు. విద్యుత్తు సరఫరాను కూడా పాఠశాలల నుంచి తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి ఘోరం మరో సారి జరగకుండా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్ చనిపోయిన విద్యార్థి కుటుంబానికి పది లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడివారికి లక్ష పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. pic.twitter.com/4sBa4y2k6f
— Dharani (@DharaniDMO) October 29, 2022