అన్వేషించండి

Konaseema News: నన్నే కరుస్తావా అంటూ తాచు పామును మెడలో వేసుకుని మందుబాబు హల్చల్.. సీన్ క‌ట్ చేస్తే...

Konaseema Viral News | న‌న్నే క‌రుస్తావా.. నీ సంగ‌తి చూస్తా... అంటూ కాటేసిన తాచు పామును మెడ‌లో వేసుకుని గ్రామంలో వీరంగం సృష్టించాడో మందుబాబు.. మెడ‌లోనే ఉన్న పాము మ‌రోసారి కాటేసింది..

ముమ్మిడివరం: మందు బాబులు కాస్త డోస్ ఎక్కువైతే తామేం చేస్తారో వారికే తెలియ‌దు. అది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైనా స‌రే వెయ్యి ఏనుగుల బ‌లం తెచ్చుకున్న‌ట్లుగా భావిస్తారు. సాహ‌సం చేయ‌రా డింభ‌కా అన్న చందంగా చిత్ర విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటారు.. లోప‌ల‌కు వెళ్లిన మందు ప్రభావం అటువంటిది మ‌రి... చుక్క మందు ప‌డితే చుక్క‌ల్లో తేలిపోతూ వారు చేసే ప‌నులు చివ‌ర‌కు విక‌టించి ప్ర‌మాదాల్లోకి చిక్కుకున్న సంద‌ర్భాలు మ‌నం చాలా వ‌ర‌కు చూస్తుంటాం.. స‌రిగ్గా అటువంటి సంఘ‌ట‌నే అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఫుల్లుగా తాగిన మందుబాబు..

ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోగల పొట్టి దిబ్బకు చెందిన గొల్లపల్లి కొండ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించాడు. ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరకు వెళ్లి కోడిగుడ్డు కోసం తన చెయ్యిపెట్టాడు. ఆ సమయంలో గంప కిందున్న తాచుపాము గొల్లపల్లి కొండను ఒక్క‌సారిగా కాటువేసింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న కొండ ఆ పామును పట్టుకుని నన్నే కాటేస్తావా.. నీ అంతు చూస్తా.. అంటూ పామును మెడలో వేసుకుని గ్రామంలో వీరంగంచేశాడు.. అస‌లే తాచుపాము.. ప్ర‌మాద‌క‌ర‌మైన‌ విషసర్పం.. పామును మెడలో వేసుకుని అక్క‌డ‌ తిరుగుతున్న కొండను చూసి గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. పామును వదిలెయ్యాలని  స్థానికులు కొండను హెచ్చరించినా ఆమాటలేమి లెక్కచెయ్యకుండా పామును మీపైకి వదులుతానంటూ గంతులేశాడు. మెడ‌లో తాచుపామును అటూ ఇటూ క‌దుపుతుండ‌డంతో బుస‌లు కొడుతూ క‌స్సుమ‌ని లేచి కొండను మరొకసారి పాము  కాటేసింది. అయినా వ‌ద‌ల‌ని కొండ దాన్ని బూతులు తిడుతూ న‌న్నే కాటేస్తావా అంటూ వీరంగం సృష్టించాడు.. 

పామును చంపి, ఆసుపత్రికి వ్యక్తిని తరలించిన స్థానికులు..

నిన్నేం చేస్తానో చూడు అంటూ తనను కరిచిన ఓ తాచుపామును మెడలో వేసుకుని హల్చల్చేసిన ఓ మందుబాబు మరోసారి పాము కాటుకు గురై, ప్రమాదకర స్థితిలోకి వెళ్తుండ‌డం గ‌మ‌నించిన స్థానికులు చొర‌వ చూపి పామును క‌ర్ర‌తో కింద ప‌డేసి ఆపై కొట్టి చంపారు. అయితే మందుబాబు కొండ ప‌రిస్థితి కాసేప‌టికి విష‌మిస్తుండ‌డంతో గ‌మ‌నించిన స్థానికులు హుటాహుటీన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొండను టి. కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించారు. ప్ర‌స్తుతం కొండ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Rajahmundry King: ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Repu Udayam 10 Gantalaku OTT : ఓటీటీలోకి 'రేపు ఉదయం 10 గంటలకు' మూవీ - రెండు వారాల్లోపే సడన్‌ స్ట్రీమింగ్
ఓటీటీలోకి 'రేపు ఉదయం 10 గంటలకు' మూవీ - రెండు వారాల్లోపే సడన్‌ స్ట్రీమింగ్
Tamil Nadu Assembly Elections: పెరంబూర్ నుంచి విజయ్ పోటీ - డీఎంకే కంచుకోటలో దళపతి సాహసం!
పెరంబూర్ నుంచి విజయ్ పోటీ - డీఎంకే కంచుకోటలో దళపతి సాహసం!
Balakrishna : హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా
హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా
Embed widget