అన్వేషించండి

AP BJP: ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ వ్యూహాలు, కోర్ కమిటీ మీటింగ్ లో కీలక నిర్ణయాలివే

AP BJP Core Committee Meeting: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకూ పది రోజులు పాటు పోరాటం చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది.

AP BJP Core Committee Meeting: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకూ పది రోజులు పాటు పోరాటం చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయాలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఛార్జ్ షీట్ లు దాఖలు చేస్తాం అన్నారు. బీజేపీ అంటే వైసీపీకి అనుకూలం అన్న వాతావరణాన్ని అధిగమిస్తాం అని చెప్పారు. ఏపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మే నెలలో 10 రోజులపాటు నిరసన, ఆందోళనతో పోరాట కార్యక్రమాలు చేపడతామన్నారు. 

కుటుంబ పార్టీలకి బీజేపీ వ్యతిరేకం అన్నారు. మే 15 నుంచి జూన్ 15 వరకు ప్రధాని మోదీ పాలన రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ ప్రచార భేరి నిర్వహిస్తుందన్నారు మాధవ్. తాము జనసేన తోనే ఉన్నామని, జనసేనతోనే కలిసి వెళ్తాం అన్నారు. జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక చేస్తున్నాo అన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుందని ఆరోపించారు. వ్యవస్థలు నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ జగన్ అరాచకాలపై కోర్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

క్షేత్ర స్థాయిలో వాగ్దానాలు.. ప్రభుత్వ తప్పిదాలు, భూ కబ్జాలపై కోర్ కమిటీలో చర్చించారు. ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పిన సీఎం జగన్  ప్రజల్ని మోసం చేసిన దానిపై రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జ్ షీట్స్ బయటకు తియ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో భూ దందా... కబ్జాలు, ఇసుక మాఫియా సమస్యతో పాటు మద్యాన్ని నిషేధించాలని వీటిన్నిటిపై ఏపీ బీజేపీ నేతలు ఉద్యమం చేయ్యాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం మోగించనున్నాం. మే 5 నుండి 16 వ తేదీ వరకు రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జిసీట్ తీసుకువచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు.

జనసేన నేతలకు కూడా ఈ కార్యక్రమాలు వివరించి కలిసికట్టుగా వేళతామన్నారు. వైసీపీతో బీజేపీ కలిసికట్టుగా వెళ్తుందని... అసత్య ప్రచారం జరుగుతుంది దాని తిప్పి కొడదాం అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాధవ్. గతంలో తెలుగు దేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందని... కుటుంబ పాలన పార్టీలకి బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారు.. కేంద్ర పెద్దలలో కూడా జనసేనాని పవన్ భేటీ అయ్యారు. జనసేన, బీజేపీ పరస్పరం గౌరవించుకుంటూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకు వెళతాం అన్నారు. 

బీజేపీతోనే పవన్..
పవన్ మాతోనే ఉన్నారు.. ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాo అని బీజేపీ నేత మాధవ్ స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తులు ఉంటాయన్నది బీజేపీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందన్నారు. రోడ్ మ్యాప్ బీజేపీయే ఇవ్వనవసరం లేదు.. పవన్ అయినా ఇవ్వచ్చు అని పేర్కొన్నారు. జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అంతా అభివృద్ది జరగాలని కోరుకుంటుందని, అయితే వైసీపీ చెప్పినట్లుగా 3 రాజధానులు ఉండవని, ఏపీకి రాజధాని అమరావతే అని తమ పార్టీ ఎప్పుడో చెప్పిందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, టీడీపీతో వెళ్లాలని అనుకుంటే తమ పార్టీ అడ్డుపడుతుందన్న టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు మాధవ్.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Amazon layoff: ఉద్యోగుల్ని విచ్చలవిడిగా  తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
ఉద్యోగుల్ని విచ్చలవిడిగా తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
Hero Splendor Price : హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
Embed widget