Pawan Kalyan: సీఎం జగన్ ను పవన్ ఏకవచనంతో సంబోధించటం వెనుక కారణం ఇదేనా!
ముఖ్యమంత్రి జగన్ ను కేంద్రంగా చేసుకొని ఏకవచనంతో మాట్లాడతానంటూ పవన్ కామెంట్స్ చేయటంపై వైసీపీ మండిపడుతుంది.
Pawan Kalyan: ఏకవచనం పాలిటిక్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి జగన్ ను కేంద్రంగా చేసుకొని ఏకవచనంతో మాట్లాడతానంటూ పవన్ కామెంట్స్ చేయటంపై వైసీపీ మండిపడుతుంది. అయితే ఇదే సమయంలో ఇంత తక్కువ టైంలో పవన్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారనే అంశంపై చర్చ మొదలైంది.
ఏకవచనం పాలిటిక్స్ పై ఏపీలో దుమారం చెలరేగుతోంది. పవన్ వారాహి యాత్ర సెకండ్ ఫేస్ లో దూకుడు పెంచుతూ ఇకపై ముఖ్యమంత్రి జగన్ ను ఏక వచనంతో మట్లాడతానని పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఉన్నపళంగా పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు ఏంటనేది ఏపీలో చర్చకు తెరలేపింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్ ను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై చర్చ జరుగుతుంది.
వారాహిని టచ్ చేశారనేనా...
ముఖ్యమంత్రి జగన్ పవన్ ను ఉద్దేశించి ఎప్పుడు విమర్శలు చేసినా దత్తపుత్రుడు అంటూ మాట్లాడటం పరిపాటిగా మారింది. దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇదే తరహాలో ముఖ్యమంత్రి జగన్ దత్తపుత్రుడు అంటూ పవన్ ఉద్దేశించి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఇటీవల కాలంలో పవన్ వారాహి యాత్ర ను ప్రారంభించారు. మెదటి విడతను పూర్తి చేసుకొని రెండో విడత యత్రలో కూడ పవన్ దూకుడుగా మందుకు వెళుతున్నారు. అయితే పవన్ వారాహి యాత్ర పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నాయకులు నారాహి యాత్ర అంటూ కామెంట్స్ చేశారు. అయినా పవన్ వాటిని పట్టించుకోలేదు. అయితే జగన్ మాత్రం వారాహి యాత్రను విమర్శించే క్రమంలో వారాహి వాహానాన్ని లారీతో పొల్చుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇదే పవన్ ను హర్ట్ చేసిందని, జనసేన వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకనే పవన్ మరింత దూకుడు పెంచే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు గౌరవంగా పిలిచే విదానానికి స్వస్తి పలుకుతూ, ఇక పై జగన్ అని పేరు పెట్టి పిలుస్తానంటూ బహిరంగంగా ప్రకటించారు.
ఏకవచనమా... ఏక పతివా..
జనసేన అధినేతన కొడిదల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏక వచనంతో సంభోదిస్తావో... ఏకపత్నితో జీవిస్తావో... అది నీ సంస్కారానికి దర్పణం అంటూ అంబటి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడతానంటూ పవన్ చేసిన కామెంట్స్ ఆయన రాజకీయానికి నిదర్శనమని అంబటి వ్యాఖ్యానించారు.
అట్టుకు రెండు అట్లు పెడతాం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి పేర్ని నాని సైతం రియాక్ట్ అయ్యారు. అట్టు వేస్తే, రెండు అట్లు వేస్తామని పేర్ని కౌంటర్ ఇచ్చారు. ఏక వచనం, ద్వివచనం, త్రివచనాలు అందరికి వచ్చని అన్నారు. అంతే కాదు పవన్ కు మాత్రమే నోరు, నాలుక లేవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యానికి కూడ నోరు, నాలుక ఉన్నాయని ఆయన హెచ్చరించారు. పవన్ ఇస్టానుసారంగా మట్లాడితే చూస్తూ ఉరుకునేది లేదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial