Mushroom Food Poisoning: శాఖాహారులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో పుట్టగొడుగులుతో చేసినవి చాలా ప్రత్యేకంగా చెబుతుంటారు.. ముఖ్యంగా రెస్టారెంట్లలో ఆర్డర్ ఇచ్చే ముందు పుట్టగొడుగులతో ఏ రెసిపీ బాగుంటుందోనని అడిగి మరీ ఆర్డర్ చేస్తుంటారు.. రుచిలోనూ అంతే ప్రత్యేకత ఉన్న పుట్టగొడుగుల వంటకాలను తింటూ ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.. అయితే పుట్టగొడుగులతో చేసిన వంటకాలను వర్షాకాలంలో తినకపోవడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల ఆహారాన్ని తినడం ఆరోగ్యకరమే అయినా వర్షాకాలంలో తింటే మాత్రం కొన్ని సందర్భాల్లో అనేక రోగాలకు కారణంగా నిలుస్తాయని హెచ్చరిస్తున్నారు. వర్షాకలంలో పుట్టగొడుగులు అసలు ఎందుకు తినకూడదో ఈ స్టోరీలో చూసేద్ధాం..
పుట్టగొడుగులు ఒక శిలీంద్రమే..
చూడడానికి తెల్లగా చాలా అందంగా కనిపించే పుట్టగొడుగులు(మష్రూమ్) తినదగిన ఒక శిలీంద్రం.. మైసీలియం రేగి పుట్టగొడుగు శిలింద్రం ఆకారంలో బయటకు వస్తుంది.. ముందు చిన్నతెల్లని పుట్టగొడుగు రూపంలోఏర్పడి అది పెరిగి గోదుమ రంగులోకి పరిణితి చెందుతుంది.. అయితే ఎక్కువ తేమ వల్ల పుట్టగొడుగులపై ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఇవి హాని కలిగించే ఫంగస్‌గాను, బ్యాక్టీరియాగాను మారడంతో వీటితో వండిన వంటకాలు ఫుడ్ పాయిజన్‌గా మారతాయి..
వర్షాకాలంలో ఈ కారణం చేతనే ఇబ్బందులు..
తాజాగా కోసిన పుట్టగొడుగులతో తయారు చేసిన వంటకాలు వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా అసలు అనర్ధం. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పుట్టగొడులుతో చేసిన ఆహారాన్ని తినడం వల్లనే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టగొడుగులు సాధారణంగా చల్లటి, తేమ గల వాతావరణంలో ముఖ్యంగా వర్షాకాలంలో దిగుబడి బాగుంటుంది.. అయితే ఉత్పత్తి ఎక్కవ ఉండడం, సరైన నిల్వ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పుట్టగొడుగులుపై హానికరమైన ఫంగస్ పెరుగుతుంది. దీంతోపాటు బ్యాక్టీరియా కూడా తోడై విషపూరితం చేస్తాయి. పుట్టగొడుగులు తేమ ఎక్కువగా ఉండే ఫంగస్ కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లలో ఉంచినా, లేదా ఆరుబయట ఉంచినా కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. వాటి రంగు, వాసన మారిపోయి వాటి బాహ్యంగా ఫంగస్ పూతలాఏర్పడి బాగా నిల్వఉండిపోతే పురుగులు ఏర్పడతాయి. అయితే ఇవి చూడకుండా గనుక వండితే ఫుడ్ పాయిజన్‌గా మారి జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు(డయేరియా) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరికొంత మందిలో చర్మం దద్దుర్లు, రేగుడు, అలర్జీలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.. అందుకే వర్షాకాలంలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలను తినకపోవడమే చేయడమే బెటర్ అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షాకాలంలో పుట్టగొడుగులు తినాలని ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.. మార్కెట్‌లో నుంచి మాత్రమే, ప్యాక్ చేసిన మరియు తాజా పుట్టగొడుగులను కొనాలి. రంగు, వాసన మారిన పుట్టగొడుగులను అసలు వాడకూడదు.. వంటకు ముందు పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి వండడం ఉత్తమం. దొరికిన, తెలియని వనంలో పెరిగిన పుట్టగొడుగులను అస్సలు తినకూడదు, విషపూరితంగా మారి పాయిజన్ అయ్యే పరిస్థితి తలెత్తుతుంది..
వర్షాకాలంలో పుట్టగొడుగులు తినడంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని, లేకపోతే తినడం వల్ల ఫుడ్ పాయిజన్, అలర్జీలు, ఇతర సమస్యలు రావచ్చని ఆహర నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అంతకీ పుట్టగొడుగులు తినాలని అనిపిస్తే పొడిగా తాజాగా ఉండే షిటాకే మష్రూమ్ లాంటి వాటిని ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.