Andhra Pradesh News: జగన్‌కు బైబై చెప్పేసిన దొమ్మేరు జమిందార్ అల్లుడు- గోదావరి జిల్లాల్లో వైసీపీకి బిగ్ షాక్
East Godavari News: గోదావరి జిల్లాల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నాలుగైదు నియోజకవర్గాలను ప్రభావితం చేసే వ్యక్తి గుడ్ బై చెప్పేశారు. కృష్ణ బాబు అల్లుడిగా పేరున్న రాజీవ్ కృష్ణ రాజీనామా చేశారు.
Rajiv Krishna Resigned To YSRCP: పారిశ్రామికవేత్త రాజీవ్ కృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజీవ్ కృష్ణ అంటే ఎలైట్ వర్గంలోనే పేరు కానీ... కృష్ణ బాబు అల్లుడు అంటే రాష్ట్ర మొత్తం తెలిసిపోతుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు గోదావరి జిల్లాల రాజకీయాన్ని శాసించిన దొమ్మేరు జమిందార్ పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణ బాబు కుటుంబం గురించి రాజకీయాల్లో తెలియనివాళ్లు లేరు. ప్రస్తుతం కృష్ణ బాబు వారసుడిగా రాజీవ్ కృష్ణ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. 2012 నుంచి వైసీపీలోనే ఉన్న ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా పదవులు నిర్వహించారు.
2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాజీవ్ కృష్ణ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తూ ఆయన జగన్‌కు షాక్ ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గంపై జగన్ వైఖరి సరిగ్గా లేదంటూ పార్టీకి దూరమయ్యారు. త్వరలోనే ఆయన టిడిపిలో చేరతారని ఇప్పటికే నారా లోకేష్‌తో చర్చలు జరిపారని ఆయన వర్గం చెబుతోంది.
గోదావరి జిల్లాల్లోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, తణుకు నియోజకవర్గాల్లో కృష్ణ బాబు కుటుంబానికి గట్టి పట్టుంది. అక్కడి అభ్యర్థుల గెలుపు ఓటమిలపై దొమ్మేరు దివాణం ప్రభావం ఆర్థికంగానూ, సామాజికంగాను చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ కృష్ణ పార్టీకి దూరం కావడం అయా నియోజకవర్గాల్లో వైసిపికి పెద్ద దెబ్బ అని చెప్పాలి.
4 సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణ బాబు
దొమ్మేరు జమీందారుగా పిలుచుకునే కృష్ణ బాబు టీడీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానన్నా కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉండేందుకే ఇష్టపడ్డారు. 2009 డిలిమిటేషన్‌లో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆయన అక్కడ పోటీ చేయడానికి లేకుండా పోయింది. తర్వాత కాలంలో ఆ కుటుంబం వైసిపిలో చేరింది.
2012లో కృష్ణ బాబు వారసుడిగా అల్లుడు రాజీవ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చి 2014లో నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ రాజకీయాల్లో కొత్త కావడం, మరోవైపు ఎన్డీఏ ప్రభంజనంతో ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసిపి విజయం తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ వచ్చారు. ఇటీవల కృష్ణ బాబు మరణించడంతో తిరిగి టిడిపిలోకి రావలసిందిగా ఆ కుటుంబంపై స్థానిక నేతలు నుంచి ఒత్తిడి పెరిగింది. పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని రాజీవ్ కృష్ణ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
Also Read: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్