చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ ఇంత చురుగ్గా ఉండడం అందరికీ ఆశ్చర్యమే. ఆయన ఏ ఆహారం తీసుకుంటారనే విషయం తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. ఆయన ఏ ఆహారం తీసుకుంటారనే విషయం తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. చంద్రబాబు ఫుడ్ హ్యాబిట్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఓ సందర్భంలో ఆయనే తాను ఏం తింటాననే విషయాన్ని విలేకరులకు చెప్పారు. దీంతో ఆయన తీసుకునే ఫుడ్ అంత సింపుల్‌గా ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. బతకడం కోసం తినాలి కానీ.. తిండి కోసమే బతకడం సరికాదని చంద్రబాబు సరదాగా ఆ సందర్భంలో చమత్కరించారు. ఉదయం ఇడ్లీ లేదా జొన్న ఇడ్లీ లేదా ఓట్స్ ఉప్మా లేదా ఒక దోశ అందులో కొంచెం చట్నీ తీసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా ఒక సీజనల్ పండు తింటారు. మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జలతో చేసిన అన్నం తీసుకుంటారు. అందులోకి ఏవైనా రెండు వెజిటబుల్ కూరలు, పెరుగు తీసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్ తింటారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక సూప్ లేదా ఏదైనా లైట్ గా ఉండే ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఇదే సమయంలో రెండు ఎగ్ వైట్స్ కూడా తీసుకుంటారు. ఇక రాత్రికి పాలు తాగి పడుకుంటారు.