నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలోకి రుతుపవనాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఎండల నుంచి భారీ ఉపశమనం కలిగింది ఆదివారం (జూన్ 2న) ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచనలతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మి.మీ, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 2, 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ రాష్ట్రమంతటా విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలతో ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. జూన్ నెలలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు