రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలు వీరికే

సచివాలయంలో మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.

మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

గృహ జ్యోతి పథకం కింద ఇకనుంచి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామన్నారు

ప్రజా పాలన దరఖాస్తులలో అప్లై చేసుకున్న రేషన్‌కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తించనుంది

మీటర్ చెక్ చేసి 200 లోపు యూనిట్లు ఉన్న వారికి జీరో కరెంట్ బిల్లును ఇవ్వనున్నారు

విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఇచ్చింది.

ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.500కే సిలిండర్ వర్తిస్తుంది

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కొందరు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు