తెలంగాణ అసెంబ్లీలో 2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు మొత్తం రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 (2 లక్షల ఒక వెయ్యి నూట డెబ్భై ఎనిమిది) కోట్లు మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా అంచనా వేశారు ద్రవ్య లోటు రూ.32,557 కోట్లు రెవెన్యూ లోటు రూ.5,944 కోట్లుగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పద్దు ఇది అత్యధికంగా ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు కేటాయింపులు ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు