హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌కు కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించారు. జనవరి 17న ప్రారంభమైన ఈ విమాన సర్వీస్ హైదరాబాద్‌ను ప్రపంచంతో అనుసంధానించడానికి మరో అడుగు వారానికి ఐదు (సోమ, మంగళ, బుధ, గురు, శనివారాలు) రోజులు విమాన సర్వీసులు విమానం హైదరాబాద్ నుంచి 1:55 గంటలకు బయలుదేరి 07:05 కు ఫ్రాంక్ఫర్ట్ కి చేరుకుంటుంది. విమానం ఉదయం 10:55 గంటలకు బయలుదేరి రాత్రి 11:55 గంటలకు హైదరాబాద్ చేరుతుంది భారత్ నుంచి ఉత్తర అమెరికాకు నలభై శాతం మంది ప్రయాణికులు యూరప్ మీదుగా వెళ్తున్నారు కొత్త విమాన సర్వీసులపై జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్ హర్షం