అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రభుత్వం నిర్దేశించిన బస్సుల్లో ప్రయాణించవచ్చు అంతర్రాష్ట్ర ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకూ ఈ సదుపాయాన్ని పొందవచ్చని స్పష్టం చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ కు జీరో టికెట్ జారీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంక్షేమానికి ఇది మొదటి అడుగు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం అన్నారు మంత్రి కొండా సురేఖకు జీరో టికెట్ అంతజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డీనరీ, సిటీ మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణం