కాంగ్రెస్ పార్టీ 62 ప్రధాన అంశాలతో 'అభయ హస్తం' పేరిట తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతినెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి చెల్లింపు
సెంట్రలైజ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటుచేసి, 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఏడాదిలో ఒకసారే ఫీజు చెల్లింపు
ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన
ఉర్దూ మీడియం పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ, తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీ ప్రకటన
తెలంగాణ 6 నెలల్లోపు కుల గణన పూర్తి, అన్నీ ఉపాధ్యాయ పోస్టులు 6 నెలల్లోపు భర్తీ
యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణ సదుపాయం
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు 10 పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష- ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.5 లక్షల సాయం
ప్రతి విద్యార్థి, విద్యార్థినులకు ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని హామీ