1983లో కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.



సిద్దిపేట నుంచి తన రాజకీయ గురువు పైనే పోటీ చేసి ఓడారు.



1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు.



1989, 1994 ల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌ను ఓడించారు.



1999లో చివరిసారిగా టీడీపీ తరపున పోటీ చేశారు.



టీఆర్ఎస్ స్థాపించాక 2004లో సిద్దిపేట నుంచే పోటీ చేసి టీడీపీ అభ్యర్థిని ఓడించారు.



అదే సమయంలో కరీంనగర్ ఎంపీగానూ గెలిచారు.



2006, 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ ఎంపీగా ఆయనే గెలిచారు.



2009-14 వరకూ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు.



2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.



అదే ఎన్నికల్లో మెదక్ ఎంపీగానూ గెలిచారు.



1995-99 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్‌గా కేసీఆర్



2004-2006 మధ్యలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా