తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యమైన నేతలంతా నామినేషన్లు వేస్తున్నారు.
మేడ్చల్ నుంచి నామినేషన్‌ వేసిన మంత్రి మల్లారెడ్డి చేతిలో రూపాయి కూడా లేదంట..
ఆస్తులు మాత్రం 95కోట్ల వరకూ ఉన్నట్లు అఫిడవిట్‌లో చెప్పారు.


కరీంనగర్‌ నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) రూ.34.08కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో దాదాపు రూ.7 కోట్ల విలువైన బంగారం వజ్రాభవరణాలు ఉన్నాయి.



ఖైరతాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ (Danam Nagender) వద్ద ఉన్న వజ్రాల విలువే రూ.6.68 కోట్లు ఉందంట. మొత్తం ఆస్తులు రూ.49.55 కోట్లు ఉందని పేర్కొన్నారు.



కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ధర్మపురి అర్వింద్‌ తనపై 17 కేసులతోపాటు రూ.107.43 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు.



సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోట నీలిమ మొత్తం ఆస్తుల విలువ రూ.54.75కోట్లుగా ప్రకటించారు.. రాజస్థాన్‌లో 10.15 ఎకరాల వ్యవసాయభూమి, ఇల్లు ఉందని అఫిడవిట్‌లో తెలిపారు.



ములుగు కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క రూ.82 లక్షల ఆస్తులతో పాటు గృహరుణం రూ.24.74 లక్షలు ఉందని పేర్కొన్నారు.



Thanks for Reading. UP NEXT

తొలిసారి అక్కడ ఓడిపోయిన KCR - ఇప్పటిదాకా గెలిచిన సీట్లు ఇవే!

View next story