కాంగ్రెస్ పార్టీ ఆశావహ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి నేతగా ప్రారంభమైంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. విద్యార్థి జీవితంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం 2001-2002 మధ్య కాలంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. రేవంత్ రెడ్డిలోని చురుకుదనం చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే టీడీపీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ తెలంగాణలో ఉనికి కోల్పోయే పరిస్థితి రావడంతో 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, 2023 మాత్రం ఘనవిజయం సాధించారు.