తెలంగాణ చిహ్నంపై వివాదం రాజుకుంది



రాజముద్ర మార్పుపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు



సోషల్ మీడియాలో తిరుగుతోన్న నమూన చిహ్నం



ప్రస్తుత అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంది



బయటి సర్కిల్‌ గోధుమ(గోల్డ్ కలర్‌), లోపలి వృత్తం చిలకపచ్చ రంగులో ఉంది.



సర్కిల్స్‌ పైభాగంలో తెలంగామ ప్రభుత్వమని ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ భాషలో రాశారు.



మధ్య సర్కిల్‌లో కాకతీయ కళా తోరణం, దాంట్లో చార్మినార్ సింబల్‌ ఉంది.



ఈ రెండు సింబల్స్‌పై మూడు సింహాల చిహ్నం ఉంది. లోపలి సర్కిల్‌ దిగువన సత్యమేవ జయతే అని రాసి ఉంది.



ఈ రాజముద్రను ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించారు.



బంగారు తెలంగాణను గుర్తుచేసేందుకు బంగారు వర్ణంతో వలయం ఉంటుంది.



శాంతికి గుర్తుగా లోగోను పచ్చని రంగులో ఉంచారు.