అన్వేషించండి

West Godavari Latest News: దిండి-చించినాడ వంతెనపై కీలక అప్‌డేట్: వరదల మధ్య ఊరట! రాకపోకలకు అనుమతి, కానీ...

West Godavari Latest News: దిండి- చించినాడ వంతెన‌పై రాక‌పోక‌ల‌కు అనుమ‌తినిచ్చారు అధికారులు. వరదల వేళ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరమ్మత్తు పనులు వాయిదా వేశారు.

West Godavari Latest News: గోదావరి నదికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఈ టైంలో ఆ ప్రాంత ప్రజానీకం పౌర జీవనానికి ఇబ్బంది పడుతోంది. వ్యాధిగ్రస్తులు వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు గర్భిణీ స్త్రీలు దూరాభార ప్రయాణాలు చేయలేకపోతున్నారు. వారి శ్రేయస్సు కోసం దిండి-చించినాడ వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు. 216వ జాతీయ రహదారి మరమ్మతులు పనుల ఆపి వంతెనపై రాక‌పోకలు ఇవాళ రేపు సడలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రకటంచారు. ఈ రెండు రోజుల్లో గోదావరి ఉధృతం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది తదుపరి ఈ నెల 23,24 తేదీల్లో వంతనపై రాకపోకలు నిలుపుదల చేసి మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

దిండి-చించినాడ వంతెన వద్ద మరమ్మతు పనులు బేరింగ్ రీప్లేస్‌మెంట్ పనుల కోసం ట్రాఫిక్ నియంత్రించారు. ఈనెల 23,24 తేదీలలో ఉదయం 10:00 నుంచి రాత్రి 08:00 వరకు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. చించినాడ 216 జాతీయ రహదారి వెంబడి పర్యటించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించి అధికార యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

వేరే ప్ర‌త్యామ్నాయం లేక‌నే ఈ నిర్ణయం..

దిండి -చించినాడ వంతెనపై రాకపోకలు నిలిపి వేసినా పశ్చిమ గోదావరి, ఇటు కోనసీమ ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగించేందుకు న‌ర్సాపురం - స‌ఖినేట‌ప‌ల్లి రేవు ద్వారా ప్ర‌త్యామ్నాయం ఉండేది. అయితే గోదావ‌రికి వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో వ‌శిష్ట న‌దీపాయ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది.. అందుకే వశిష్ట న‌దిపై పంటు దాటింపులు ప్ర‌మాద‌క‌రం అని భావించిన అధికారులు పంట్లు కానీ, ప‌డ‌వ‌లు ద్వారా కానీ ప్ర‌యాణికుల‌ను దాటించ‌కూడ‌ద‌ని నిషేదాజ్ఞ‌లు జారీ చేశారు. దీంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లు కానీ,న‌ర్సాపురం లేదా భీమ‌వరం నుంచి కోన‌సీమ ప్రాంతానికి రాక‌పోక‌లు సాగించాలంటే రావుల‌పాలెం మీదుగా చుట్టు తిరిగి సుమారు 100 కిలోమీట‌ర్లు పైబ‌డి దూరం ప్ర‌యాణించాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని నిషేధించిన రెండు రోజులు వంతెన‌పై రాక‌పోక‌లు సాగించేందుకు అనుమ‌తిని ఇస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.

లైట్ మోటారు వెహిక‌ల్స్‌కు మాత్రమే అనుమ‌తి..

ప్ర‌స్తుతం దిండి - చించినాడ వంతెనకు మ‌ర‌మ్మ‌త్త‌లు జ‌రుగుతున్నాయి. ఈక్ర‌మంలోనే భారీ వాహ‌నాల‌ను పూర్తిగా నిషేధించారు. తాజాగా ఇచ్చిన అనుమ‌తుల నేప‌థ్యంలో ద్విచ‌క్ర వాహ‌నాల‌కు, లైట్ మోటారు వెహిక‌ల్స్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అంటే కార్లు, అంబులెన్స్‌లు, ఆటోలు, మినీ వ్యాన్‌లు రాక‌పోక‌లు సాగించ‌వ‌చ్చు. స‌రకు ర‌వాణా చేసే ట్ర‌క్కుల‌కు, ట్రాక్ట‌ర్ల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని అధికారులు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget