అన్వేషించండి

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ధీమా!

Nara Bhuvaneshwari: మాజీ ఎంపీ హర్ష కుమార్ నారా భువనేశ్వరిని పరామర్శించారు.

Nara Bhuvaneshwari: మాజీ ఎంపీ హర్ష కుమార్.. నారా భువనేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు దారుణం అన్నారు. అలాగే ఆయన ఆరోగ్యం గురించి నారా భువనేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ధైర్యంగా ఉండమని భువనేశ్వరికి చెప్పారు. అనంతరం బయటకు వచ్చిన హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ...  చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు కూడా చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. ఈ ధైర్యానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయరనే నమ్మకమేనని పేర్కొన్నారు.

అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు బయటికి వస్తారని వివరించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని ఇంతకాలం సెంట్రల్ జైల్లో నిర్బంధించగలిగారంటే వైసీపీ వెనుక బీజేపీ కూడా ఉందని అన్నారు. పూచీకత్తుతో బెయిల్ ఇచ్చి విచారణకు సహకరించాలని చెబితే సరిపోయేదానికి జెల్లో ఉంచడం దారుణం అన్నారు. 

బీజేపీ కావాలనే పొలిటికల్ గేమ్ ఆడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్ర సంస్థలను వాళ్ల ఆధీనంలో ఉంచుకొని.. కావాలనే పొలిటికల్ గేమ్ లో భాగంగా ఇటువంటి చర్యలు చేస్తుందని విమర్శించారు. వీటన్నిటికీ పుల్ స్టాప్ పడాలంటే మళ్లీ తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని కేంద్ర సంస్థలు గాడిలో పడతాయని పేర్కొన్నారు.

బండారు సత్యనారాయణకు బెయిల్

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ఆర్‌కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్‌కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A),  41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

టీడీపీ సీనియర్ నేత బండారు వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు గుంటూరు నుంచి మంగళవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా వెన్నెలపాలం వెళ్లారు. చాలా సేపు నోటీసులు తీసుకోకుండా బండారు తలుపు గడియ పెట్టుకున్నారు. ఎట్టకేలకు తలుపులు బ్రేక్‌ చేసి బండారును ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బండారును గుంటూరు తీసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు చేశారు. బీపీ ఎక్కువ ఉండటంతో బండారును ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం జగన్, మంత్రి రోజా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుంటూరులో రెండు కేసులు నమోదు చేశారు.

నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రెండు రోజుల కిందట మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ నీతి సూత్రాలు, ప‌తివ్రత కామెంట్స్ చేస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ వ‌ద్ద నీ పూర్తి బండారం ఉంద‌న్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget