Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్
Andhra Pradesh News | పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు విషయంలో ఖచ్చితంగా తన అలసత్వం ఉందని, చంద్రబాబు తిడతారని, అవసరమైతే కొడతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
Andhra Pradesh minister రాజమండ్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు విషయంలో ఖచ్చితంగా తన అలసత్వం ఉందని, అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనను తిడతారని, అవసరమైతే కొడతారని, ఆయనను తండ్రి కంటే ఎక్కువగా భావిస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇటీవల టీడీపీ అంతర్గత టెలీకాన్ఫిరెన్స్‌లో చంద్రబాబు క్లాస్ ఇచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవ్వడంపై ఆయన ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు..
వైసీపీ కోవర్టుల ద్వారా ఆ ఆడియో బయటకు
సుమారు 1000 మంది పాల్గొన్న తమ అంతర్గత టెలీ కాన్ఫరెన్స్‌లో కోవర్టులున్నారని వైసీపీ కోవర్టుల ద్వారా ఆ ఆడియో బయటకు వచ్చిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వైసీపీ అనుకూల మీడియాలో లేనిపోని అభియోగాల్ని మోపారన్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు విషయంలో 25 శాతం తక్కువ ఉండడానికి తన అలసత్వం ఉందని.. తండ్రి కంటే ఎక్కువగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వార్డు కౌన్సిలర్ కూడా కాని తనను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని చెప్పారు. తనకు చాలా బాధ్యత ఉంటుందని, చంద్రబాబు తిడతారు అవసరమైతే కొడతారు.. నాకులేని ఇబ్బంది.. సాక్షి ఛానెల్, వైసీపీ పేటీఎం బ్యాచ్ తనను దారుణంగా ట్రోలింగ్ చేశారని చెప్పారు. అయితే చేసినదానికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు మంత్రి సుభాష్.
సుమారు 25 శాతం ఉన్న ఓటు నమోదు శాతం ఈ రోజు 45 శాతానికి పెరిగింది. ఈరోజు చూసుకుంటే 65 శాతంకు పెరిగింది.. లక్షలు ఖర్చుచేసినా ఇటువంటి పబ్లిసిటీ రాదన్నారు. కుల పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు.. అది తప్పు అని.. ఎక్కువశాతం నియోజకవర్గానికే పరిమితం అవుతున్నానని, కుల సంఘాలు కలుస్తున్నాయని, తనకోసం అంతా పనిచేశారని, ఎవరైతే తనకోసం కష్టపడ్డారో వారందరికోసం పనిచేస్తున్నానని వాసంశెట్టి సుభాష్ అన్నారు.
రాజకీయాలను రాజకీయంగా చూస్తున్నానని, అదేవిధంగా స్థానిక నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు నిజం కాదన్నారు. రామచంద్రపురం నాయకులు, కార్యకర్తలను కాపాడుకునే పనిలోనే ఉన్నానన్నారు. అమలాపురం నియోజకవర్గానికి చెందిన వారిని పట్టించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు ఉన్నారన్నారు. ప్రభుత్వ పరంగా వంద రోజులు పూర్తయిన సందర్భంగా సూపర్ సిక్స్ ను వేగవంతం చేస్తామన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛిన్నాభిన్నం చేశారని సుభాష్ అన్నారు. గత అయిదేళ్ల పాలనలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే అన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత సిలెండర్‌లు ఇస్తున్నారన్నారు.. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాల నిమిత్తం యువనేత లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్నారు.. ప్రతీ నియోజవకర్గంలోనే ఇండ్రస్టియల్ పార్కు ఉండాలని నిరుద్యోగ యువత ద్వారా ఏదైనా పరిశ్రమ కానీ, స్మాల్ స్కేల్ ఇండ్రస్టీలు పెట్టడం ద్వారా చాలా మంది నిరుద్యోగులు బయటపడతారని, దాదాపు 90 శాతం సబ్సిడీ ఇచ్చి విజన్ ఉన్న నాయకుడు అని 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ఎంత తప్పుచేశారో ప్రజలు తెలుసుకున్నారన్నారు.
Also Read: AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!