PDS Rice At Kakinada Port: బియ్యం ఎగుమతుల్లో బినామీల బాగోతం, కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది?
Andhra Pradesh News | కాకినాడ పోర్ట్ ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ కేంద్రంగా నిర్వహిస్తొన్న కొన్ని బినామీ ట్రేడింగ్ కంపెనీలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Kakinada Port | కాకినాడ పోర్టు కేంద్రంగా పేదల బియ్యం ఎగుమతులు ద్వారా కోట్లాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అక్రమ రవాణా మాత్రం ఏమాత్రం అదుపులోకి రాలేదని తాజా పరిణామాలతో కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకు కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్లులకు చేర్చి అక్కడ ఫాలిష్ చేయడం, ఆపై ఆకర్షనీయంగా ప్యాకింగ్‌లు చేయించి ఆపై చెక్‌పోస్టుల తనిఖీలు అధిగమించి కాకినాడ పోర్టు ద్వారా వేల టన్నుల పేదల బియ్యాన్ని సునాయాసంగా తరలించేస్తున్నారు. ఈ తంతుకు బినామీ ట్రేడిరగ్ కంపెనీలు కార్యచరణ చేస్తుండగా మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
కాకినాడ పోర్టు కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా..
గడచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిందని ఎన్నికల ప్రచార సభల్లోనూ, వారాహి సభల్లోనూ సాక్షాత్తూజనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. నేరుగా పేరుపెట్టి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోస్తానని కూడా శపథం చేశారు.. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కాకినాడ పోర్టులో ద్వారంపూడి సోదరుల హవా నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.. బియ్యం ఎగుమతుల్లో తిరుగులేని శక్తిగా ఉన్న ద్వారంపూడి కుటుంబ సభ్యులు కనుసన్నల్లోనే పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతులు విదేశాలకు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మెరుపు తనిఖీలు తరువాత నేరుగా డీప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా సివిల్ సప్లై మినిస్టర్ నాదేండ్ల మనోహర్‌ను వెంటబెట్టుకుని మరీ కాకినాడ పోర్టు తనిఖీకు వచ్చారు.. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్రనుప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాకినాడ చెక్‌పోస్ట్‌లు దాటుకుని కాకినాడ యాంకరేజ్ పోర్టుకు మత్తుపదార్ధాలు కూడా వస్తున్నాయి.. ఇవన్నీ మీకు తెలియదా అని ప్రశ్నించారు. అషీ ట్రేడిరగ్ కంపెనీ, మానస కంపెనీలు ఎవరివి.? ఎవరీ అలీషా..? అగర్వాల్ ఎవరు..? అంటూ డీఎస్‌వో ఎంవీ ప్రసాద్, డీఎస్పీ రఘువీర్ విష్ణును ప్రశ్నించారు..
బినామీ కంపెనీలు.. అక్రమాలు వేరే లెవెల్..
కాకినాడ పోర్టు కేంద్రంగా విదేశాలకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుండగా సుమారు 16 ట్రేడిరగ్ కంపెనీలు ఈ దందాను సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిలో కింగ్‌ఫిన్ కంపెనీపై ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మానస ట్రేడిరగ్ కంపెనీ పాత్ర గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ కంపెనీ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడిదిగా తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు సందర్భంగా స్వయంగా అధికారులే చెప్పడం విశేషం.
రూ.43.50 కు ప్రభుత్వం కొనుగోలు చేసి బియ్యంను పేదలకు పంపిణీ చేస్తుండగా ఇదే బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అతితక్కువకే తిరిగి కొనుగోలు చేసి ఆతరువాత మిల్లుల్లో ఫాలిష్ పట్టి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు చేసి వాటిని కిలో రూ.70 చొప్పున విదేశాలకు విక్రయిస్తున్నారు. పీడీఎస్ బియ్యం ఫాలిష్ చేసి సన్నబియ్యంగా పలు మిల్లర్లతో కుమ్మక్కయ్యి ట్రేడిరగ్ మాఫియాఏమార్చి అక్కడి నుంచి చెక్‌పోస్టుల తనిఖీలను సమర్ధవంతంగా దాటుకుని కాకినాడ పోర్టుకు చేర్చుతున్నారు. అక్కడ కూడా అధికారుల అండదండలతో సునాయాసంగా విదేశాలకు తరలిస్తున్నారు..