అన్వేషించండి

Pandillapalli Srinivas : వీరప్పన్ కు మరణశాసనం రాసిన తెలుగు ఆఫీసర్, ఇప్పటికీ దొరకని తల!

Pandillapalli Srinivas : వీరప్పన్ సొంత గ్రామంలోని ఓ గుడిలో మన తెలుగువాడు పందిళ్లపల్లి శ్రీనివాస్ విగ్రహం ఉంది. అసలు అక్కడ శ్రీనివాస్ విగ్రహం ఎందుకు పెట్టారో తెలుసా?

Pandillapalli Srinivas : వీరప్పన్ ..  20 ఏళ్లపాటు మూడు రాష్ట్రాల పోలీసులను, ప్రభుత్వాలను గడగడలాడించిన భయంకరమైన గంధపు చెక్కల స్మగ్లర్. కానీ అలాంటి  స్మగ్లర్ దురాగతాలను మొట్టమొదటిసారి ప్రపంచానికి తెలియజేసింది, అతడి అరెస్ట్ కు కారణమైంది మాత్రం మన తెలుగువాడు అనేది చాలామందికి తెలియదు. ఆయనే మన తరం మరిచిపోయిన కీర్తి చక్ర అవార్డు గ్రహీత పందిళ్లపల్లి శ్రీనివాస్. 

వీరప్పన్ సొంత ఊరి గుడిలో  శ్రీనివాస్  విగ్రహం  
 
ఒక ఆఫీసర్ పేరును రాజమండ్రిలో ప్రధాన రహదారికి పెట్టారు. వీరప్పన్ చేతిలో దారుణంగా హత్యకు గురైన IFS అధికారి విగ్రహాన్ని వీరప్పన్ సొంత ఊరి గుడిలో పెట్టి పూజిస్తున్నారంటే ఆయన సాధించిన ఘనత ఎలాంటిదో తెలుస్తోంది. విధి నిర్వహణలో ఆయన ముద్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు . డెహ్రాడూన్ లో ట్రైనింగ్ అయ్యే IAS, IPS సహా ఇతర అత్యున్నత అధికారులకు శ్రీనివాస్ సాహసాల గురించి ఒక పాఠంగా చెబుతున్నారు అంటేనే ఆయన దక్షత ఎలాంటిదో చెప్పొచ్చు. 

రాజమండ్రిలో జననం -కేరళలో ఉద్యోగం  

పందిళ్లపల్లి శ్రీనివాస్  1954 సెప్టెంబర్ 12 న ఏపీలోని రాజమండ్రిలో పుట్టారు.  సివిల్ సర్వీస్ లో ర్యాంక్ సాధించి ఫారెస్ట్ అధికారిగా కర్ణాటకలోని చామరాజ్ నగర్ అడవులకు వెళ్లారు. అది తమిళనాడు బోర్డర్ లో ఉంది. అప్పటికే అక్కడ వీరప్పన్ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే తన గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువ. వీరప్పన్ చేస్తున్న చట్టవ్యతిరేక పనులను గమనించిన శ్రీనివాస్ వాటి గురించి పై అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేశారు. వీరప్పన్ కు సహకరిస్తున్న గ్రామ ప్రజల్లో అవగాహన తేవడం కోసం వారికి చదువును పరిచయం చేశారు. సొంత డబ్బుతో స్కూలు కట్టించారు. అలాగే హాస్పిటల్ కూడా స్మగ్లింగ్ వెళ్లే కూలీలకు డిపార్ట్మెంట్ లో వాచర్స్ గా, గార్డ్స్ గా ఉద్యోగాలు ఇప్పించారు. శ్రీనివాస్ చొరవతో వీరప్పన్ సొంత ఊళ్లో 40 ఇళ్లు కట్టించారు. ఇలా తన వద్దకు వచ్చే వాళ్లు ఆగిపోవడంతో ఒంటరివాడైన వీరప్పన్ 1986లో  ఒకరోజు శ్రీనివాస్ కు దొరికిపోయాడు. వీరప్పన్ ను చంపే అవకాశం ఉన్నా శ్రీనివాస్ మాత్రం వీరప్పన్ మారాలనుకున్నారు. వీరప్పన్ ఇచ్చిన సమాచారంతో తన స్థావరాలపై దాడులు చేసి అతను దాచిన గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.  అయితే శ్రీనివాస్ ఈ దాడుల కోసం కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవుల్లో తిరుగుతున్న సమయంలో ఒక రాత్రి పోలీసుల వద్ద నుంచి వీరప్పన్ తప్పించుకుపోయాడు. దీనిపై అక్కడి పోలీసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈలోపు శ్రీనివాస్ ను ట్రైనింగ్ కోసం అమెరికా పంపింది ప్రభుత్వం. శ్రీనివాస్ లేకపోవడంతో వీరప్పన్ రెచ్చిపోయాడు. తమిళనాడుకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరంను వీరప్పన్ కిడ్నాప్ చేసి చంపేశాడు. దానితో మొదటిసారి భారత ప్రభుత్వం వీరప్పన్ పై దృష్టి పెట్టింది.

అమెరికా నుంచి  అడవులకు శ్రీనివాస్  
 
వీరప్పన్ అరాచకాలు పెరిగిపోవడంతో ప్రత్యేకంగా ఏర్పడిన స్పెషల్ టాక్స్ ఫోర్స్ కోసం శ్రీనివాస్ ను అమెరికా ట్రైనింగ్ నుంచి వెనక్కి పిలిపించింది ప్రభుత్వం. వీరప్పన్ గురించి అన్ని వివరాలు తెలిసిన శ్రీనివాస్ ఉంటే వీరప్పన్ ఆట కట్టవచ్చని ప్రభుత్వం భావించింది. అది వర్క్ అవుట్ కూడా  అయింది. 1990 జూన్ లో టాస్క్ ఫోర్స్ లో చేరిన శ్రీనివాస్ , స్మగ్లర్ వీరప్పన్ చుట్టూ ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేశారు. పైగా శ్రీనివాస్ వీరప్పన్ సొంత ఊళ్లో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అక్కడి ప్రజలు జేజేలు పలకడం మొదలెట్టారు. గోపీనాథం ఊళ్లో ఫ్రెండ్స్ ద్వారా సేకరించిన విరాళాలతో మరియమ్మన్ దేవాలయం కట్టించారు. ఇది వీరప్పన్ ను మరింత రగిలిపోయేలా చేసింది. తన అనుచరులు సైతం శ్రీనివాస్ చర్యల వల్ల చెట్లు నరకడానికి రాకపోవడంతో పూర్తిగా ఒంటరివాడయ్యాడు వీరప్పన్. ఇక మరోసారి దొరికిపోవడం తథ్యం అనే భావించాడు.

శ్రీనివాస్ ను చంపడానికి  కుట్ర 
 
శ్రీనివాస్ బతికి ఉంటే తన ఉనికికే ప్రమాదం అని భావించిన వీరప్పన్ ఆయన్ని చంపడానికి కుట్ర చేశాడు. ముందుగా విషప్రయోగం చెయ్యడానికి ప్రయత్నించినా..ఊరివాళ్లు ఎవరూ సహకరించలేదు. దానితో మరో పథకం వేశాడు. ఈలోపు స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో శ్రీనివాస్ టెన్యూర్ పూర్తి అయింది. అదనవు సెక్యూరిటీ వెనక్కి వెళ్లిపోయింది. అయినప్పటికీ అన్ని దారులూ మూసుకుపోయిన వీరప్పన్ లొంగిపోవడం మినహా  మరో ఆప్షన్ లేదని భావించిన శ్రీనివాస్ అక్కడే ఉండిపోయారు. .ఒక రోజు వీరప్పన్ నుండి శ్రీనివాస్ కు మెసేజ్ వచ్చింది. ఆయుధాలు లేకుండా ఒంటరిగా వస్తే తాను లొంగిపోతానని వీరప్పన్ చెప్పాడు. వీరప్పన్ ను నమ్మవద్దని చాలామంది చెప్పినా శ్రీనివాస్ మాత్రం ఛాన్స్ తీసుకోవాలనుకున్నారు. 1991 నవంబర్ 9న వీరప్పన్ తమ్ముడు అర్జునన్ శ్రీనివాస్ ను తమ సొంత ఊరు గోపీనాథంలో కలుసుకున్నాడు. అతనికి శ్రీనివాస్ గతంలో చాలా సహాయం చేశాడని ఫారెస్ట్ అధికారులు చెబుతారు. ఆ రాత్రి వారు వీరప్పన్ మేనమామ పొన్ను స్వామి ఇంట్లోనే భోజనం చేశారు. అయితే పొన్నుస్వామి వీరప్పన్ ను నమ్మవద్దని ఇందులో ఏదో కుట్ర ఉందని శ్రీనివాస్ కు చెప్పాడని అయితే తనకూ అనుమానం ఉన్నప్పటికీ వీరప్పన్ లొంగిపోయే అవకాశం దేన్నీ వదులుకోనని చెప్పిన శ్రీనివాస్ ఆ తర్వాత రోజు అంటే 10 నవంబర్ అక్టోబర్ ఉదయమే గోపీనాథం గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవుల్లోకి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆ సమయంలో శ్రీనివాస్ తో కృష్ణ అనే ఫారెస్ట్ వాచర్, పొన్నుస్వామి,మరో ఇద్దరు గ్రామస్తులు,అర్జునన్ మాత్రమే ఉన్నారు. కృష్ణ అనేవాడు కూడా ఒకప్పుడు వీరప్పన్ గ్యాంగ్ లో వాడే. అయితే తనతో స్మగ్లింగ్ మాన్పించి ఫారెస్ట్ వాచర్ గా ఉద్యోగం ఇప్పించింది శ్రీనివాస్ నే.

శ్రీనివాస్ ను ఎంత దారుణంగా చంపారంటే

ఎలాంటి సిబ్బంది తోడూ ఆయుధాలు లేకుండా ఒంటరిగా వస్తున్న శ్రీనివాస్ చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు వీరప్పన్. అడవుల్లో ఉన్న ఒక  చిన్న కాలువ దాటే ముందు కాళ్లు, చేతులూ కడుగుకోవడానికి వంగిన శ్రీనివాస్ ను వీరప్పన్ అనుచరుడు ఒకరు వెనక నుంచి కాల్చాడు. వెంటనే చెట్ల చాటు నుంచి వచ్చిన వీరప్పన్ ఎదురు నుంచి రెండు బుల్లెట్లు కాల్చాడు. అప్పటికే స్పృహ తప్పిన శ్రీనివాస్ తల నరికిన వీరప్పన్ ..ఆ తలతో అడవుల్లోకి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు శ్రీనివాస్ శరీరాన్ని పెట్రోల్ తో కాల్చారు. శ్రీనివాస్ వెంట వెళ్లిన గ్రామస్తులు పారిపోయారు. అడవిలో ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పింది వాళ్లే.

ఎలుగెత్తి ఏడ్చిన గోపీనాథం
 
శ్రీనివాస్ చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులు గుండెలు బద్దలయ్యేలా ఏడ్చారు. తమ గ్రామానికి తమకు ఎంతో చేసిన శ్రీనివాస్ ను ఇంత దారుణంగా వీరప్పన్ హత్య చేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోయారు. అందుకే వీరప్పన్ సొంత ఊళ్ళో  శ్రీనివాస్ కట్టించిన మరియమ్మన్ గుడిలోనే శ్రీనివాస్ విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు.

కీర్తి చక్ర అవార్డ్ ప్రదానం
 
రాష్ట్రం కాని రాష్ట్రంలో అత్యంత ధైర్య సాహసాలను చూపిన శ్రీనివాస్ త్యాగాన్ని గుర్తిస్తూ కేంద్రం 1992 లో కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఆయన తల్లి తండ్రులు ఇటీవలే మరణించారు. ఆయన తమ్ముడు సత్యనారాయణ, అక్కలు, బావ రూప్ కుమార్ లు రాజమండ్రిలోనే ఉంటున్నారు.

చనిపోయినా బతికున్న శ్రీనివాస్
 
శ్రీనివాస్ చనిపోయినా చివరకు ఆయన  రూపొందించిన రూట్ మ్యాప్ అనుసరించిన విధానాలను ఉపయోగించే 2004లో వీరప్పన్ ఆచూకీ రాబట్టి ఎన్ కౌంటర్ చేశారు అధికారులు. అలాగే, రాజమండ్రి లోని ఆయన ఇల్లు ఉన్న రోడ్డుకు కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ రోడ్డు అని పేరు పెట్టారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, డెహ్రాడూన్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ప్రతీ ఏటా విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చూపిన అధికారులకు శ్రీనివాస్ పేరుతో గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారు.

నవంబర్ 10 - అటవీ అధికారుల సంస్మరణ దినం

శ్రీనివాస్ చనిపోయిన నవంబర్ 10న ప్రతీ ఏటా అటవీ అధికారులు సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు అధికారులు. అలాగే దేశంలోని అటవీ శాఖ కార్యాలయాల్లో శ్రీనివాస్ ఫోటోను ఉంచుతున్నారు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శ్రీనివాస్ జీవిత చరిత్రను సివిల్ సర్వీస్ ట్రైనింగ్ లో ఒక పాఠ్యాంశం చేశారు. అలాగే విజయ విహారం వారు పబ్లిష్ చేసిన కీర్తి చక్ర పందిళ్ల పల్లి శ్రీనివాస్ పుస్తకం ఆయన సాహసాన్ని తెలుగువారికి పరిచయం చేసింది.

గోపినాథంలో శ్రీనివాస్ విగ్రహం 

శ్రీనివాస్ అందించిన సేవలకు కర్ణాటక ప్రభుత్వం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించింది. తాజాగా వీరప్పన్ సొంత ఊరు గోపీనాథంలో శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన సోదరి రాజ్యాలక్షి, బావ రూప్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కర్ణాటకలో దేవుడిగా మారిన మన తెలుగువాడు పందిళ్లపల్లి శ్రీనివాస్ గురించి ప్రస్తుత జెనరేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget