Rains in AP, Telangana: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
Andhra Pradesh Rains | బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Rains In AP And Telangana | హైదరాబాద్: గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం నిన్న దక్షిణ తమిళనాడుతో పాటు దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య దిశగా గాలులు వీచనున్నాయని వాతారణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్న జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాయలసీమలో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో నేడు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలో వాతావరణం పొడిగా మారుతుంది. తీరం వెంట బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చు ఏ ప్రమాదం లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. నవంబర్ 4న ఏపీకి వర్ష సూచన అంతగా లేదు.
District forecast of Andhra Pradesh dated 02-11-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/TLIQ0JY31N
— MC Amaravati (@AmaravatiMc) November 2, 2024
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజులనుంచి చల్లనిగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం దిగొచ్చాయి. నేడు తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Daily Weather PPT of Telangana dated 02.11.2024@TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/QbM3PIWJSX
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 2, 2024
తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే..
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 33.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా నల్గొండలో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట భద్రాచలంలో 25.5 డిగ్రీలు, ఖమ్మంలో 25 డిగ్రీల ఉష్ణోగ్రత.. మెదక్ లో అత్యల్పంగా 18.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 19.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో పగటిపూట 32 డిగ్రీలు, రాత్రివేళ 22.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వర్షాలు కురవడంతో చలి గాలుల ప్రభావం పెరిగింది. ఈశాన్య రుతుపవనాల వల్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది.
Also Read: Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!