అన్వేషించండి

Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాయుగుండం ఒడిశా, బెంగాల్ తీరం దాటి పశ్చిమాన కదులుతోంది.
  • ఏపీలో వర్షాలు, బలమైన గాలులు; మత్స్యకారులకు హెచ్చరికలు జారీ.
  • తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం; కొన్నిచోట్ల ఈదురు గాలులు.

అమరావతి: ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. ఇది ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు 40 కిలోమీటర్లు, చాంద్‌బలికి 50 కిలోమీటర్లు, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ చాంద్‌బలి-దిఘా మధ్య బాలాసోర్‌ సమీపంలో తీరాన్ని దాటిందని తెలిపారు. తీరం దాటిన అనంతరం తదుపరి 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ముందుకు కదిలే వీలుందని ఆయన వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఈ వాయుగుండం ప్రభావంతో సోమవారం (జులై 6న) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున రెండు రోజులపాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్

తెలంగాణ వర్షాలు, వాతావరణ అప్‌డేట్.. తగ్గనున్న వర్షాలు

గడిచిన 3 రోజులుగా అల్పపీడనం (LPA) కారణంగా మంచి వర్షాలు కురిసిన తర్వాత, తెలంగాణలోని చాలా ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. మధ్య, తూర్పు, పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో రోజంతా చాలా వరకు పొడిగా ఉంటుంది, సాయంత్రం తరువాత కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు..

 

Frequently Asked Questions

వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది?

వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్, చాంద్‌బలికి దగ్గరగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ వాయుగుండం ప్రభావంతో జులై 6న ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి.

మత్స్యకారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుంది?

తెలంగాణలోని చాలా ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget