Weather Update: ఇప్పటికే ముంచేసిన వాన.. ఇవాళ మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం దాటింది. అయితే ఆ సమయంలో పలు ప్రాంతాల్లో విపరీంతగా వర్షాలు పడ్డాయి.
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వానలు ఎక్కువగా పడ్డాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదిలిన వాయుగుండం. పుదుచ్చేరి-చైన్నై మధ్య శుక్రవారం తీరం దాటిందని ఐఎండీ అధికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. వాయుగుండంలో ప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలలి సూచించింది.
ఏపీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపింది.
Subdivisional Mid-day forecast for Andhra Pradesh (Telugu) dated 19.11.2021 pic.twitter.com/FxSM81l7Qk
— MC Amaravati (@AmaravatiMc) November 19, 2021
తిరుపతిలో ఎన్నడూ లేనంత వర్షం దంచికొడుతుంది. భారీ వర్షాల కారణంగా గ్రామాలు, కాలనీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాలు వరదలతో జలవిలయంతో వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. శ్రీవారి మాడవిధులు చెరువుల్లా కనిపించాయి.
తెలంగాణలోనూ పలుప్రాంతాల్లో వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులంబ గద్వాల్ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 19, 2021
Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ఇద్దరు చిన్నారులు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది
Also Read: Rajampeta: రాజంపేట వరద ఉద్ధృతిలో 12 మంది మృతి... దాదాపు 30 మంది గల్లంతు...
Also Read: Anantapur: వరదలో చిక్కుక్కున్న 11 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు