Nellore-Mumbai Highway : పెన్నా నది ప్రవాహంతో ముంపులో జాతీయ రహదారి
పెన్నా నది ప్రవాహానికి నెల్లూరు-ముంబై హైవేలో కొంత భాగం నీట మునిగింది. ఆత్మకూరు, నెల్లూరు మధ్యలో జాతీయ రహదారిపైకి పెన్నా నది ప్రవాహం వచ్చి చేరింది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి 5లక్షల క్యూసెక్కుల నీరు వదిలేయడంతో పెన్నాకి వరదనీరు పోటెత్తింది. పెన్నాకి వరద వస్తే.. సంగం ఆనకట్ట సమీపంలో కరకట్టపైనుంచి ప్రవాహం బయటకు వచ్చేస్తుంది. పంటకాలవలగుండా పెన్నమ్మ రోడ్లపై ప్రవహిస్తుంది. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అయింది. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డు పక్కనే ఉన్న దాబాలను ఖాళీ చేయించారు. ప్రవాహ ఉధృతి ఎక్కువైతే ఆయా ప్రాంతాలు మునిగిపోతాయనే ముందు జాగ్రత్తతో వారిని అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు





















