RRR Vs Ysrcp : ఉన్న పరిశ్రమల్నే వెళ్లగొడుతున్నారు.. స్కిల్ కాలేజీల్లో చదువుకునేవారికి ఉద్యోగాలెలా? ప్రభుత్వానికి రఘురామ ప్రశ్న
స్కిల్ కాలేజీలు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. అయితే అక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్ విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ను పొడుగుతున్నారో తిడుతున్నారో తెలియకుండా ట్వీట్లు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వ్యాక్సినేషన్ గొప్పగా సాగుతూందంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను రఘురామ ప్రదర్శించారు. ఆయన ట్వీట్‌లో దేశంలోనే అద్భుతంగా వ్యాక్సినేషన్ జరుగుతుందన్నట్లుగా ఉందని కానీ లెక్కల్లో మాత్రం దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే.. 29వ రాష్ట్రంగా ఏపీ ఉందనే సంగతిని గుర్తు చేశారు. దేశంలో అతి తక్కున వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా ఏపీ ఎందుకు ఉందో విజయసాయిరెడ్డి చెప్పాలన్నారు. Also Read : ఏపీలో స్కిల్ కాలేజీల ఫెస్టివల్
పనికి రాని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని.. వాలంటీర్లలో అనేక మంది అవకతవకలకు పాల్పడుతున్నారు. ఓ వాలంటీర్ ఏకంగా 80 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై మీడియాలో వచ్చిన వివరాలను రఘురామ ప్రదర్శించారు. ఈ వాలంటరీ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలిస్తే ప్రభుత్వానికి ఎన్నో నిధులు ఆదా అవుతాయన్నారు. అలాగే మటన్ మార్ట్‌ల అంశంపై ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపైనా స్పందించారు. మంత్రి సీదిరి అప్పలరాజు మటన్ మార్టుల గురించి చెప్పిన మీడియాపై నిందలు వేయడాన్ని రఘురామ తప్పు పట్టారు. మటన్ మార్టుల గురించి సాక్షి పేపర్‌లోనే మొదటగా వచ్చిందన్నారు. Also Read : పార్టీ పటిష్టతకు రేవంత్ మెగా ప్లాన్ ?
ఇక అమరావతి అసైన్డ్ రైతుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రఘురామ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్యాయం చేయాలనుకున్న వారే అన్యాయమైపోతారన్నారు. అమరావతి అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకునేలా జారీ చేసిన జీవోపై ప్రభుత్వం స్టే విధించింది. తదుపరి చర్యలపై స్టేటస్ కో ఇచ్చింది. స్కిల్డ్ యూనివర్శిటీలను పెట్టాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని రఘురామ సమర్థించారు. యూనివర్శిటీలు.. లోక్ సభ నియోజకవర్గానికో కాలేజీ పెట్టాలనుకుంటున్నారని... ఇది మంచి పరిణామం అన్నారు. అక్కడ చదువుకున్న వారందరికీ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ అన్నారని కానీ ఉన్న పరిశ్రమల్నే తరమేస్తూంటే కొత్తగా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని ప్రశ్నించారు. Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంను మించి విద్యుత్ బకాయిల గొడవ !
ఎయిడెడ్ కాలేజీలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. ఆ కాలేజీలను ఆస్తులతో సహా అప్పిగించాలనడం.. వాటి ఆస్తులపై కన్నేయడమేనన్నారు. సీబీఐ కోర్టులో తాను వేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును వాయిదా వేయాలని హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పైనా రఘురామకృష్ణరాజు మాట్లాడారు. సాక్షిలో ముందే తీర్పు చెప్పినందున తీర్పు విషయంలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయని అందుకే కోర్టును మార్చాలని కోరినట్లుగా చెప్పారు.