Pulivendula ZPTC by-election: పులివెందులలో పోలీసులపై వైసీపీ నేతల ఆగ్రహం- నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్
Pulivendula Latest News: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికను తలపించింది. ఇక్కడ పోటీ టీడీపీతో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పోలీసులను టార్గెట్ చేశారు.

Pulivendula Latest News: జరిగేదే జడ్పీటీసీ ఎన్నిక. అది కూడా ఉపఎన్నిక. కానీ అది పులివెందుల. అందుకే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నంత హీట్ పుట్టిస్తోంది. వారం రోజుల నుంచి టీడీపీ, వైసీపీ మధ్య కవ్వింపు చర్యలు, కొట్లాటలు, విమర్శలు ప్రతి విమర్శలు సాగాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ రోజు జరిగిన సీన్స్ మరో ఎత్తు. అధికారంలో ఉన్న టీడీపీ పోలీసులను వాడుకొని రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. అసలు తమకు ప్రధాన ప్రత్యర్థులు ఖాకీలే అని ప్రకటించింది. అంతే కాదు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా పోలీసులు ఒక్కరు కూడా ఉద్యోగాల్లో ఉండరని పోస్ట్‌మ్యాన్ పనులు చేసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలు వర్సెస్ పోలీసులు పంచాయితీ తీవ్ర స్థాయికి చేరుకుంది. చాలా రోజుల నుంచి టీడీపీకి పోలీసులు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ కోయ ప్రవీణ్‌పై మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన ఏకంగా టీడీపీ లీడర్ మాదిరిగానే ఉండి వైసీపీ నేతలను బెదిరిస్తన్నాని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పులివెందులలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పోలింగ్ రోజు అది మరింతగా పెరిగింది. పోటీ చేసిన టీడీపీ, వైసీపీ మధ్య ఉండాల్సిన పోరు ఇప్పుడు పోలీసుల వైపు టర్న్ అయింది. పోలీసులే ప్రత్యక్షంగా టీడీపీ విజయం కోసం పని చేస్తున్నారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఓటర్లను, వైసీప ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానివ్వకుండా, టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకునేందుకు సహకరిస్తున్నారని మండిపడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత వాళ్ల సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
పులివెందులలో డీఎస్పీ మురళీనాయక్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాగి వచ్చి రుబాబు చేస్తే కాల్చి పడేస్తానంటూ హెచ్చరించిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులకు తుపాకులు ఇచ్చింది జనాన్ని బెదిరించడానికా అని ప్రశ్నిస్తున్నారు. ఖాకీదుస్తులు ఉన్నాయని అహంకారంతో విర్రవీగితే నాలుగేళ్ల తర్వాత సినిమా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాల్చిపడేస్తానంటూ డీఎస్పీ చేసిన కామెంట్స్‌ను అవతలి వ్యక్తి కూడా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు చెప్పారని ఇప్పుడు రెచ్చిపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఖాఖీ దుస్తులు వున్నాయి అని అహంకారంహా..
— Sagar Reddy (@Sagar_YSJ) August 12, 2025
చంద్రబాబు నాయుడు గారు నీకు చప్పాడని అహంకారంహా
తిరిగీ వాడు నువ్వు అన్న మాట అంటె ఎమ్ చెస్తావ్
-అంబటి రాంబాబు గారు..🔥 pic.twitter.com/85RiwEooM1
వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కర్నీ గుర్తు పెట్టుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు అతి చేస్తున్న ప్రతి పోలీసు కూడా నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాల్లో ఉండబోరని హెచ్చరించారు. కచ్చితంగా అలాంటి వారంతా పోస్టుమ్యాన్‌ల మాదిరిగా ఉండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పులివెందులలో అరాచకం చేసిన టీడీపీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవబోదని అన్నారు.
4 సంవత్సరాల తరువాత మా రోజు అంటూ వచ్చాక..ఈ రాష్ట్రం లో టీడీపీ పార్టీ కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేదు..
— Naveen Kumar Lakhani (@naveenkumarlakh) August 12, 2025
ఈ దాష్టికానికి సహరించిన ప్రతి పోలీస్ అధికారి, మాదంటూ ఒక రోజు వచ్చాక వాళ్ళు పోలీస్ ఉద్యోగంలో ఉండరు..#pulivendulazptc #pulivendulazptcbyelection @rachamallu_siva pic.twitter.com/4CEyuWjSgp
మరో వీడియోలో కూడా పోలీసులపై విమర్శలు చేశారు రచమల్లు. ఇలాంటి పోలీసులను చూస్తుంటే సిగ్గేస్తోందని అన్నారు.
పోలీసులు చేయాల్సిన డ్యామేజ్ చేశారని ఎవరూ గొడవలు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని ఎంపీ అవినాశ్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. పోలీసులు, టిడిపి కార్యకర్తలు ఒక్కటేనని వారిపైనే భవిష్యత్‌లో పోరాటం చేయాలని న్యాయస్థానాల్లో వారిని దోషులుగా నిలబెడదామని అన్నారు.
పోలీసులు మనకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశేసారు
— Sagar Reddy (@Sagar_YSJ) August 12, 2025
పోలీసులను, టిడిపి కార్యకర్తలు ఒక్కరే
గుర్తుపెట్టుకోండి చాలు భవిష్యత్తులో న్యాయంగా వీళ్లతో పోరాడదాo.
- అవినాష్ రెడ్డి pic.twitter.com/AKKNG3gyVI
పులివెందులలో పోలీసులు చేసిన పనికి భవిష్యత్‌లో ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారని అంజాద్ బాషా హెచ్చరించారు. ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి మరీ శిక్షిస్తామని అన్నారు. చాలా మంది పోలీసులు తమ లిస్ట్‌లో ఉన్నారని చెప్పారు.
పోలీస్ అధికారులు కు భవిష్యత్తులో ప్రతిఫలం గట్టిగా ఉంటుంది.
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) August 12, 2025
పోలీస్ అధికారులు అందరూ మా లిస్టులో ఉన్నారు.
మీరు ఎక్కడ దాక్కున్నా చొక్కా పట్టుకొని నిలదీస్తాం.
- అంజాద్ భాషా pic.twitter.com/NpJ60v5WA5
మరో ప్రాంతంలో కూడా పోలీసులపై అంజాబ్ బాషా ఉగ్రరూపందాల్చారు. వేసుకున్న ఖాకీ దుస్తులకైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మీరు వేసుకున్న దుస్తులుకి న్యాయం చేయండి..
— Sagar Reddy (@Sagar_YSJ) August 12, 2025
పోలీసులు పై అంజాద్ భాష ఉగ్రరూపం.🔥
కొంచెం అయినా పోలీసులకు సిగ్గుందా. pic.twitter.com/sB4vXbxvnG
ఇలా పులివెందుల జడ్పీ ఎన్నిక పోలీసులు వర్సెస్ వైసీపీలా మారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.





















