అన్వేషించండి

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజికి ప్రతిష్టాత్మక అవార్డు

Prakasam Barrage : విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజికు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైంది.

Prakasam Barrage : విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage) ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ICID)కు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ (WHIS)అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో ప్రకాశం బ్యారేజీకి అవార్డు లభించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ,సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్సిఐడి డైరెక్టర్ అవంతి వర్మ పేర్కొన్నారు. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు  ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసీఐడీ ఈ అవార్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు. 

వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ -2023 అవార్డులకు ఐసీఐడీ, ఐఎన్సీడీల తరపున వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈ అవార్డులకు ప్యానల్ జడ్జెస్ సిఫార్సు చేసి ఎంపిక చేశారని, వాటిలో భారతదేశం నుంచి 4 నిర్మాణాలను ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్-2023 అవార్డుకు ఎంపిక చేసినట్లు డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు. భారతదేశం నుంచి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజి(Prakasam Barrage)తో పాటు ఒడిశా లోని బలిద్హిహా(Balidiha)ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు, తమిళనాడులోని శ్రీవాయికుంటం(Srivaikuntam) ఆనకట్ట ఈఅవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు. ఈ విధంగా ఎంపికైన నిర్మాణాలను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లకు సంబంధించిన ఐసీఐడీ రిజిష్టర్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2 నుంచి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసీఐడీ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నట్టు డైరెక్టర్ అవంతి వర్మ తెలియ జేశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికను త్వరలో ఆయా రాష్ట్రాలకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలు 25వ ఐసీఐడీ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశానికి హాజరయ్యేందుకు రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ణప్తి చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget