అన్వేషించండి

ZPTC ByElections: చెదురుమదురు ఘటనలతో ముగిసిన జడ్పీటీసీ పోలింగ్ - ఎన్నిక రద్దు చేయాలన్న వైసీపీ - గురువారం ఫలితాలు !

Pulvendula: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. గురువారం కౌంటింగ్ జరగనుంది.

Polling for ZPTC by elections ends amid tensions: కడపజిల్లాలో రెండు రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఒంటి మిట్టలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగడంతో అక్కడకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్లారు. పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన సమయంలో కొన్ని చోట్ల.. పోలింగ్ స్టేషన్లకు దూరంగా దాడులు జరిగాయి. ఆ తర్వాత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.        

అన్ని పార్టీల ముఖ్య నేతల హౌస్ అరెస్టులు        

ఉదయమే అన్ని పార్టీల ముఖ్య నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎంపీ అవనాష్ రెడ్డిలను ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వారిని వదిలి పెట్టారు. అయితే మధ్యలో అవినాష్ రెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులకు తెలియకుండా వచ్చేసి పులివెందుక వైసీపీ ఆఫీసుకు వెళ్లడం ఉద్రిక్తలకు కారణం అయింది. అక్కడ డీఎస్పీ .. వైసీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి కాల్చిపడేస్తానని హెచ్చరించడం వివాదాస్పదమయింది.          

ఎనభై శాతం వరకూ పోలింగ్        

పోలింగ్ దాదాపుగా ఎనభై శాతం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు  తీరారు. అన్ని చిన్న చిన్న గ్రామాలే అయినా.. వర్గ పోరాటాలు ఉండటంతో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ సతీష్ కుమార్ అక్కడే రోజంతా ఎన్నికలను పర్యవేక్షించారు. వైసీపీ నేతలు ఎన్నికలు సరిగ్గా జరగలేదని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకు వచ్చారని ఆరోపించారు. గ్రామాల్లోని మహిళలు వారి ఓట్లను వారిని వేయనివ్వలేదని.. రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.                   

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపణ              

ఈ ఎన్నికలు సరిగ్గా జరగలేదని.. న్యాయపోరాటం చేస్తామని వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కడపలోని ఉర్దూ యూనివర్సిటీకి తరలించారు. గురువారం ఉదయం కౌంటింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ల ఎన్నిక కావడంతో .. గురువారం సాయంత్రానికి ఫలితంపై స్పష్టత వస్తుంది.  ఈ ఎన్నికలపై ఇప్పటికే పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.   

ఓడిపోతారని తెలిసే వైసీపీ ఆరోపణలు చేస్తోందంటున్న టీడీపీ  

వైసీపీ నేతల స్పందన నిరాశాజనకంగా ఉంది. తాము గెలుస్తామని వారు చెప్పడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తున్నారు. ఫలితాలు రాక ముందే ఓటమికి కారణాలు చెబుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.  ఈ ఎన్నికపై న్యాయస్థానంలో సవాల్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.                     

టాప్ హెడ్ లైన్స్

World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Secretariat Employees Protest: సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ ధర్నాలో ఉద్రిక్తత.. డ్యూటీలో ఉన్న సీఐ మృతి
సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ ధర్నాలో ఉద్రిక్తత.. డ్యూటీలో ఉన్న సీఐ మృతి
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget