Container Politics in AP : ఏపీలో మరో కంటెయినర్ రాజకీయం - అది ప్యాంట్రీ అని క్లారిటీ ఇచ్చిన వైఎస్ఆర్‌సీపీ !
Andhra Politics : ఏపీ రాజకీయాల్లో మరో కంటెయినర్ వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే అది వంట సామాన్లు తీసుకెళ్లిన కంటెయినర్ అని వైసీపీ వాదిస్తోంది.
Political Controversy started another container Issue in AP : డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉండగానే.. మరో కంటెయినర్‌పై ఏపీ రాజకీయాల్లో చర్చ ప్రారంభమయింది. మంగళవారం సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు దగ్గరకు ఓ కంటెయినర్ వచ్చింది. పోలీస్ స్టిక్కర్ తో ఆ కంటెయినర్ ఉంది. కానీ పోలీసు వాహనం కాదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ను బట్టి ఆర్టీసీ వాహనంగా భావిస్తున్నారు. ఆ కంటెయినర్ .. సీఎం క్యాంప్ ఆఫీస్ గేట్ వద్ద కాస్త లోపలికి వెళ్లి వస్తువుల్ని దింపడమో.. లేకపోతే ఏదో లోడ్ చేసుకుని వెళ్లడమో జరిగింది. ఈ దశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రారంభించింది. అ కంటెయినర్‌లో ఏం తెచ్చారు.. ఏం తీసుకెళ్లారన్నదానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా ఈ విషయంలో అనేక ప్రశ్నలు సంధిస్తోంది.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైజాగ్ పోర్ట్ కు..
— Telugu Desam Party (@JaiTDP) March 27, 2024
కంటెయినర్లలో అక్రమంగా 3 వేల కోట్ల డబ్బు, డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్ విదేశాలకు తరలిస్తున్నారా ?#EndOfYCP#YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/WzIgGzY3Bg
అయితే ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో స్పందించింది. ఆ కంటెయినర్.. వంట సామాన్లను తీసుకెళ్లిందని.. అది ప్యాంట్రీ కార్ అని స్పష్టం చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.
సీఎం @ysjagan బస్సుయాత్ర సందర్భంగా దారిలో ఆహారాన్ని తయారు చేసుకునే పాంట్రీ వాహనం.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తే.. ఆ వాహనంపై రామోజీ పచ్చ మీడియాలో దుష్ప్రచారం.#BanYellowMediaSaveAP pic.twitter.com/K3O0nRm1YM
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కంటెయినర్‌లో అట్టపెట్టెల్లో డబ్బుల కట్టలున్నాయని వాటిని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారన్నారు. సీసీటీవీ పుటేజీలు బయట పెట్టాలని పట్టాభి డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ వాహనాన్ని ఎవరూ తనిఖీ చేయకపోవడం వివాాదాస్పదమవుతోంది. తన వాహనాన్ని ఉదయం సాయంత్రం తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆ వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంటి దగ్గరికి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. నిబంధనలు ఎందుకు పాటించలేదని నిలదీశారు. ఆ కంటెయినర్‌లో ఏముందని ప్రశ్నించారు. బ్రెజిల్ సరుకా? లిక్కర్ మాఫియా ద్వారా మెక్కిన వేల కోట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లా? అని లోకేశ్ ట్వీట్ చేశారు. డీజీపీ సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.
అయ్యా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులూ.. రోజు నా కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? మీ ఎదురుగా సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన… pic.twitter.com/RZTz25J7A3
— Lokesh Nara (@naralokesh) March 27, 2024