(Source: ECI/ABP News/ABP Majha)
Tenali Anna Canteen : తెనాలిలో "అన్న క్యాంటీన్" రగడ - అక్కడ కర్ఫ్యూ కంటే ఎక్కువగా రూల్స్ !
తెనాలిలో అన్న క్యాంటీన్ వల్ల ట్రాఫిక్ సమస్య అవుతుందని అడ్డుకున్నారు పోలీసులు. అయితే అసలు ఆ రోడ్‌లోకి ట్రాఫిక్ వెళ్లకుండా ఆపేశారు.
Tenali Anna Canteen : తెలుగుదేశం పార్టీ వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశం తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తలకు కారణం అవుతోంది. తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. గత నెల 12వ తేదీన ప్రారంభమైన అన్న క్యాంటీన్ ఆదరణ పెరుగుతోంది. మధ్యాహ్నం సమయంలో పెద్ద ఎత్తున పేదలు తరలి వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే హఠాత్తుగా క్యాంటిన్ తాసేయాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ వల్ల మున్సిపల్ మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇరవై రోజుల నుంచి పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్
ఐదు రోజుల కిందట వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా ఓ టెంట్ ఏర్పాటు చేసి అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు ఉదయం అ టెంట్‌ను తొలగించారు. ఆ తర్వాత ఆ రోడ్‌ను మూసివేశారు. బారీకేడ్లు పెట్టారు. అంటే వైఎస్ఆర్‌సీపీ క్యాంటీన్‌తో పాటు అన్నా క్యాంటీన్ కూడా తెరవకుండా పోలీసులు చేశారు. అయితే ఇదంతా అన్నా క్యాంటీన్‌ను మూసి వేయడానికి పోలీసులు, అధికారులతో కలిసి వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఆడిన డబుల్ గేమ్ అని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. పేదలకు ఓ పూట కడుపు నింపితే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ఆర్‌సీపీ కూడా పోటీ క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతతాయమని రెండింటిపైనా ఆంక్షలు
పోలీసులు అడ్డుకున్నా తాము మాత్రం పేదలకు అన్నం పెడతామని.. అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్కెట్ సెంటర్ మొత్తంపోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. ఓ రకంగా కర్ఫ్యూ వాతావరణం ఉంది. దుకాణాలు కూడా మూయించారు. ఆందోళనలు జరుగుతాయన్న సమాచారం ఉందని.. అందుకే మూసేశామని పోలీసులు చెబుతున్నారు. బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరు వర్తకులపైనా పోలీసులు ఆంక్షలు పెట్టారు. పోలీసుల తీరుతో రోజూ మధ్యాహ్నం సమయంలో ఆకలి తీర్చుకునే కూలీలు, నిరుపేదలు ఇతరులకు .. ఆ అవకాశం లేకుండా పోయింది.
అప్పటిలోపే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్
పేదలకు అన్నం పెడితే ఎందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతల ప్రశ్నలు
అన్నా క్యాంటీన్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు కావాలనే వివాదం చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. పేదలకు అన్నం పెడితే అధికార పార్టీకి వచ్చే సమస్య ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం.. మంగళగిరితో సహా పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లపై ఆంక్షలు పెడుతూండటంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు.
కేబినెట్, టీఆర్ఎస్‌ఎల్పీ భేటీలే కాదు అసెంబ్లీ కూడా - కేసీఆర్ స్పీడ్ నిర్ణయాలు !