అన్వేషించండి

Jogi Ramesh bail: జోగి రమేష్‌కు షాక్ - ఎక్సైజ్ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్

Jogi Ramesh : జోగి రమేష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లుగా వారు పిటిషన్‌లో తెలిపారు.

Petition For cancel Jogi Ramesh bail: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖుల చేశారు.  అక్రమంగా జరిగిన నకిలీ మద్యం తయారీ, అమ్మకాల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ . ఆయన సోదరుడు జోగి రాములపై గతంలో కేసులు నమోదయ్యాయి.  ఈ కేసులో వీరిద్దరినీ A18, A19 నిందితులుగా  గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం , తాజాగా వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులు బయట ఉంటే సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తారని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సిట్ తన పిటిషన్‌లో గట్టిగా వాదించింది.                                      
 
అన్నమయ్య జిల్లా ములకలచెరువు ,  ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లను నిర్వహించినట్లు ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ రాకెట్ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ మాస్టర్ మైండ్‌గా ఉన్నారని, ఆయన పర్యవేక్షణలోనే అక్రమ బాట్లింగ్ యూనిట్లు నడిచాయని కేసులోని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి ,  రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి పక్కా ప్రణాళికతో ఏప్రిల్ 2024లో నకిలీ మద్యం ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాలని జోగి రమేష్ ఆదేశించినట్లు సిట్ తన అభియోగపత్రంలో పేర్కొంది.                                     

సిట్ జరిపిన విచారణలో జోగి సోదరులకు మరియు,  అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయి. జోగి రాము ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లాయని, ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేయడానికి రూ. 3 కోట్ల వరకు ఎర చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో ఈ ముఠాకు లింకులు ఉన్నాయని, ముడిసరుకును వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, నకిలీ లేబుళ్లు , హోలోగ్రామ్‌లతో వీటిని మార్కెట్లోకి వదిలారని దర్యాప్తులో వెల్లడైంది.                           

దాదాపు 83 రోజుల జైలు జీవితం తర్వాత ఇటీవల షరతులతో కూడిన బెయిల్ పొందిన జోగి సోదరులు, విడుదలైనప్పటి నుండి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ విద్వేషాలను రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థి పార్టీల శ్రేణులను రెచ్చగొట్టడం ద్వారా శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని సిట్ తన పిటిషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ క్రమంలో, సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వీరిని మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం అత్యవసరమని సిట్ కోరుతోంది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుండటంతో జోగి బ్రదర్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget