Crime News: నాటువైద్యం చేయిస్తానని తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం.. తప్పించుకుని రాగా మరో ముఠా కూడా..

ఆ కుటుంబం ఆపదను ఆసరాగా చేసుకున్నారు. వచ్చిన రోగం నయం చేయిస్తానని చెప్పి.. వ్యభిచారం చేయించారు.

FOLLOW US: 

ఓ బాలికకు కరోనా సోకింది. ఆమెకు నాటు వైద్యం చేయిస్తానని చెప్పింది ఓ కిలేడీ. నిజమేననుకుని నమ్మాడు ఆ తండ్రి.  కానీ అక్కడకు వెళ్లాక.. బాలిక పరిస్థితి వేరేలా ఉంది. ఆ మహిళ.. బాలికతో వ్యభిచారం చేయించడం ప్రారంభించింది. ఈ కేసులో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు అర్బన్ పోలీసులు.. వారి వద్ద నుంచి 12 సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు, కారు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే..

పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, కూతురికి కరోనా సోకడంతో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అయితే దురదృష్టవశాత్తు.. అతడి భార్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో జూన్‌లో మృతి చెందింది. భార్యకు అంత్యక్రియలు.. అయిపోయాక.. బిడ్డతో ఇంటికి వచ్చాడు. పల్నాడులోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది బాలిక. ఆమెకు 13 ఏళ్లు. బాలికకు తండ్రి తప్ప మరెవరు లేరు. అయితే వీళ్ల.. అవసరాన్ని.. పసిగట్టింది అదే గ్రామానికి చెందిన ఓ కిలేడీ. బాలికకు.. నాటువైద్యం చేయిస్తానని తండ్రికి చెప్పింది. రోగం తగ్గుతుందని నమ్మబలికి.. తనతోపాటుగా బాలికను తీసుకెళ్లింది.

ఆమెతో వెళ్లాక బాలిక కష్టాలు మెుదలయ్యాయి. వెళ్లాగానే.. వ్యభిచారం చేయాలంటూ.. బాలికపై ఒత్తిడి తెచ్చింది.  తనకు ఆ పనిచేయడం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా.. వినలేదు. చివరకు బాలికను బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. కొన్ని రోజులు.. గుంటూరు, ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌ తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించారు. 

అయితే ఎలాగోలా.. వాళ్ల దగ్గర నుంచి బాలిక తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి విజయవాడకు వచ్చింది. అక్కడ బాలికను మరో ముఠా అదుపులోకి తీసుకుని. మళ్లీ వ్యభిచారం చేయించారు. బాలిక చేతికి వేరే వ్యక్తి ద్వారా ఫోన్ రాగా.. ఆమె తన తండ్రికి కాల్ చేసిన జరిగిన విషయం అంతా చెప్పింది. తండ్రి వెళ్లి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కనుగొన్నారు. 23 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 10మంది ఆర్గనైజర్స్‌ ఉన్నట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని వెల్లడించారు.

Also Read: Sukesh Chandrashekhar: సుఖ పురుష్ సుకేష్.. ఓటీటీ వెబ్ సీరిస్‌గా జాక్వలిన్-బ్లఫ్‌మాస్టర్ లవ్ స్టోరీ? ఇంతకీ కథేంటీ?

Also Read: West Godavari Crime: బైక్ పై టూర్ కు వెళ్తున్నట్లు బిల్డప్... బ్యాక్ పాక్ లో లిక్విడ్ గంజాయి... తనిఖీల్లో పట్టుబడిన కేటుగాళ్లు

Also Read: Warangal Drugs Case: వరంగల్‌లో డ్రగ్స్ మాఫియా.. సైడ్ ట్రాక్ పట్టి జీవితాలు కోల్పోతున్న యువత, బీటెక్ స్టూడెంట్స్!

Published at : 25 Dec 2021 09:22 PM (IST) Tags: Corona Girl Gunturu Crime news Gunturu Girl prostitution case Gunturu Urban Police

సంబంధిత కథనాలు

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Bengal Tiger In AP: కోస్తాలో రెండు బెంగాల్ టైగర్స్ తిరుగుతున్నాయా? టెన్షన్ పెడుతున్న వరుస దాడులు

Bengal Tiger In AP: కోస్తాలో రెండు బెంగాల్ టైగర్స్ తిరుగుతున్నాయా?  టెన్షన్ పెడుతున్న వరుస దాడులు

Breaking News Telugu Live Updates: సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Breaking News Telugu Live Updates: సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

టాప్ స్టోరీస్

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Indian Railways: సింగిల్ ఛాయ్‌కు రూ.70 వసూలు చేసిన రైల్వేశాఖ- ఎందుకో తెలుసా?

Indian Railways: సింగిల్ ఛాయ్‌కు రూ.70 వసూలు చేసిన రైల్వేశాఖ- ఎందుకో తెలుసా?