News
News
X

Warangal Drugs Case: వరంగల్‌లో డ్రగ్స్ మాఫియా.. సైడ్ ట్రాక్ పట్టి జీవితాలు కోల్పోతున్న యువత, బీటెక్ స్టూడెంట్స్!

గత కొన్నేళ్లుగా కస్టమర్లుగా మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే ఇప్పుడు ఈ దందాకు ప్రమోటర్లుగా మారుతున్నారు. పోలీసులకు సైతం కేసులను ఎలా డీల్ చేయాలో అర్థంకాక ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి.

FOLLOW US: 
Share:

గంజాయి అక్రమ రవాణాకు ఓరుగల్లు అడ్డాగా ఎందుకు మారుతుంది. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ, మంచి పొజిషన్‌లో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత ఎందుకు చెడిపోతుంది. మత్తు మాఫియాపై పొలీసుల నిఘా సరిపోవడం లేదా... అసలు వరంగల్ లో ఏం జరుగుతుంది..‌ రాష్ట్ర సరిహద్దులు దాటి ఖిల్లా కోటలో రాజ్యమేలుతున్న గంజాయి మాఫియాపై స్పెషల్ స్టోరీ...

యూత్ సైడ్ ట్రాక్...
వరంగల్ సిటీ గంజాయికి ఫేమస్ అవుతోంది. నిన్న మొన్నటివరకు యూత్ టార్గెట్ గా ముఠాలు బిజినెస్ చేసేవి. ఏళ్ల తరబడి అక్రమ వ్యాపారాలు చేస్తూ జిమ్మిక్కులు తెలిసినోళ్లు ఇందులో కీ రోల్ ప్లే చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత కొన్నేళ్లుగా కస్టమర్లుగా మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే ఇప్పుడు ఈ దందాకు ప్రమోటర్లుగా మారుతున్నారు. తెలిసీ తెలియని వయసులో డ్రగ్స్‌కు బానిసయ్యే వారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి మరో నలుగురికి డ్రగ్స్ అమ్ముతున్నారు. ఒక్కో సెంటర్ లో ఒక్కో స్టూడెంట్ ను ప్రమోటర్ గా చేసుకుని బిజినెస్ షురూ చేసింది. పోలీసులు నిఘా పెట్టినా మత్తు, ఈజీ మనీ, మర్డర్ అంశాలలో యూత్ సైడ్ ట్రాక్ పడుతుందని గుర్తించారు. వరంగల్ పోలీసులకు గంజాయి అడ్డుకట్ట ఛాలెంజ్ గా మారుతుంది. 

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో పాటు త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలతో అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. సమాజంలో ఎందుకు బ్రతుకుతున్నాం అనడం కంటే ఎలా బ్రతుకుతున్నాం అనే పాయింట్ ను ఫాలో అవుతున్నారు. చెడు దారిలో సులువుగా డబ్బు సంపాదించి జల్సాలు చేయోచ్చునని భావిస్తున్నారు. తమ చదువు, తెలివితేటల్ని గుట్టు చప్పుడు కాకుండా ఎంచక్కా గంజాయి అక్రమ రవాణాకు వాడేస్తున్నారు. కటకటాల పాలవుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి స్మగ్లర్ల పరిస్థితి చూస్తే.. జిల్లానే ఎందుకు కేంద్రంగా మారుతుంది అనేది మరోప్రశ్న... ఇప్పుడు పోలీసులను వెంటాడుతోంది.

గత రెండు నెలల నుండి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో అక్రమ దందాకు నడుస్తున్న తీరును చూస్తే పోలీసులే నివ్వెర బోతున్న సందర్భాలున్నాయి. వరంగల్ నగరానికి చెందిన దండేబోయిన సుమన్ స్టోరి ఒక విధంగా ఉంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పి కోటి రెడ్డి ఆధ్వర్యంలో పట్టుబడిన గంజాయి మిస్టరీ మరో తీరుగా ఉంది. చేస్తున్న వ్యాపారంలో  నష్టం వాటిల్లడంతో అప్పుల బాధలు తాళ లేక ఒకరు గంజాయి దందాలో దిగితే.. ఆర్ధిక ఇబ్బందులను అధికమించేందుకు మరో వ్యక్తి ఈ అక్రమ దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది.

వరంగల్ రూరల్ జిల్లా మామూనురు పొలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ ఐదుగురు వ్యక్తుల ముఠా వద్ద నుండి  రెండున్నర కిలోల గంజాయి దొకడం, అటు వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను గుర్తించి, బారీ మొత్తంలో నూట యాబై కిలోల గంజాయి పట్టుబడింది. ఇటు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట 365 హైవే రోడ్డుపై తనిఖీలో భాగంగా బొలెరో వాహనంలో  తరలి‌స్తుండగా 44 కిలోల గంజాయి పట్టుబడటంతో పాటు మడికొండ, ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్ధులకు సరఫరా చేస్తున్న ఓ మైనర్ బాలుడిని పట్టుకుని జువైనల్ హోమ్ కు తరలించడం స్థానికంగా సంచలం రేపుతుంది...

గతంలో నిట్ లో ఎకంగా 8A ఎన్‌క్లేవ్‌లో గంజాయి సేవిస్తూ విద్యార్థులు పట్టుబడటం 11 మందిని నిట్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలన్న తపనతో ఇలా సంపన్నులు, యువకులను టార్గెట్ గా గంజాయి దందా సాగిస్తుండటంపై వరంగల్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంఎంసీ కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా గంజాయి పట్టుబడిన సందర్బాలఉన్నాయి. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న వరంగల్ ఎంజీఎంకూ కూడా గంజాయి సెగ తగిలింది. అర్ధరాత్రి గంజాయితో పట్టుబడిన సంఘటనలు మట్టేవాడ పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యాయి.

పరోక్షంగా కరోనా ప్రభావం.. 
కరోనా నేపథ్యంలో కాలేజీలు బంద్ అయ్యాయి. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా మంది యూత్ తాము చేసే జాబ్స్ పోగొట్టుకున్నారు. కాలేజీ లేకపోవడంతో చదివే విద్యార్థులు టైంపాస్ అంటూ కొందరి మాయ మాటలు నమ్మి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆపై డ్రగ్స్ కొనేందుకు డబ్బులు కావాలని.. వారే బిజినెస్ మొదలుపెట్టడం కలకలం రేపుతోంది. రెండు బైకులు తీసి క్షణాల్లో వెళ్లి డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్నారు. యువకులను చూస్తే.. వీళ్లు విద్యార్థులు అయి ఉండొచ్చు.. టైంపాస్‌గా బైక్‌లపై తిరుగుతున్నారనుకుంటారు. కానీ డ్రగ్స్ విక్రయిస్తున్నారనో, డ్రగ్స్ కు బానిస అయ్యారనో అనుమానం కలగదని వీరి నమ్మకం. పైగా కొంచెం టైమ్ కష్టపడితే చాలు జల్సాలకు కావాల్సిన డబ్బు చేతికొస్తుందని మాయమాటలు చెప్పి ఈ నరకకూపంలోకి లాగుతున్నారు. 

వరంగల్ పోలీసులు టన్నుల కొద్ది గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నా. వందలాది కేసులు బుక్ చేసిన అంతకు పదిరెట్లు వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి. చేతిలో పైసలు లేకపోవడం, జల్సాలు చేయాలనే కోరిక ఉండటంతో డ్రగ్స్ మాఫియా యువతన్ టార్గెట్ చేసి వారి చేత ఇలాంటి పనులు చేయిస్తోంది. యువత, విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేయడంతో స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయి అమ్మకం స్మగ్లింగ్ కు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది.  హైదరాబాద్ మొదలు బార్డర్ ఆదిలాబాద్ వరకు ఇక్కడి నుంచే సప్లై అవుతోందని.. స్థానిక పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ ట్రైసిటీలోని వరంగల్ రైల్వే క్వార్టర్స్, శివనగర్,  కాశిబుగ్గ, పోచమ్మ మైదాన్, పెద్దమ్మగడ్డ, కిట్స్ కాలేజీ వుండే ఎర్రగట్టు గుట్ట, వడ్డేపల్లి చర్చి దగ్గర, ఎన్ఐటీ ఏరియాతో పాటు అటు సిటీ ఇటు విలేజ్ లకు జంక్షన్ గా వుండే ఆరేపల్లి గ్రామాల్లో  గంజాయి అమ్మకాలకు సెంటర్ గా మారాయని తెలుస్తుంది. మత్తు, డబ్బుల కోసం యువత హత్యలు చేయడానికి సిద్ధమైతే పరిస్థితి మరోలా ఉంటుందని.. పోలీసులు దీనిపై మరింత ఫోకస్ చేస్తున్నారు.

వరంగల్ నగరంలో నిల్వ చేసిన గంజాయిని లోకల్ ఏజెంట్ల ద్వారా ఆయా ప్రాంతాల్లోని యువకులకు సరపరా చేస్తూనే మరోవైపు ఖాజీపేట రైల్వేస్టేషన్ లను అడ్డాలుగా మార్చుకుంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర,మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల కు రైళ్లలో ప్రయాణిస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ముఖ్యంగా యువతనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ సిగరెట్, గుట్ట్కా, చాక్లెట్లలో కలుపుతూ విక్రయాలను చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసి టెక్నికల్‌గా యువత ఈ దందా చేయడం కొత్త సమస్యలకు దారి తీయవచ్చు. 

తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వెళ్తే ఏం చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచాలని.. తద్వారా మొదటి దశలోనే వారిని దారిలోకి తీసుకురావడం సాధ్యపడుతుందని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, వారి ప్రవర్తనను సైతం కాలేజీకి వెళ్లి తెలుసుకుని  అబ్జర్వేషన్ చేసే విధంగా తల్లిదండ్రులు భాద్యతగా ఉండాలని కోరుతున్నారు.

Also Read: Gold Silver Price Today: నిలకడగా బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవీ..

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Dec 2021 01:09 PM (IST) Tags: telangana news warangal Crime News DRUGS drugs smuggling Drugs Mafia Warangal Drugs Mafia Youth

సంబంధిత కథనాలు

Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 147 మంది బాలకార్మికులకు విముక్తి- సీపీ ఏవీ రంగనాథ్

Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 147 మంది బాలకార్మికులకు విముక్తి- సీపీ ఏవీ రంగనాథ్

Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!

Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Mini Medaram Jathara: మేడారం మినీ జాతర ప్రారంభం - నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు!

Mini Medaram Jathara: మేడారం మినీ జాతర ప్రారంభం - నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు!

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

టాప్ స్టోరీస్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Unstoppable NBK PSPK: దేశంలోనే తొలిసారి - కొత్త రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్!

Unstoppable NBK PSPK: దేశంలోనే తొలిసారి - కొత్త రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్!

Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!