ఏవోబీలో తుపాకీ మోత.. ఒకరికొకరు ఎదురుపడ్డ పోలీసులు, మావోయిస్టులు
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఏవోబీలో కాల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి.
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పోలీసులు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే.. తులసిపాడు అటవీ ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి.
Also Read: Hyderabad: మీకు పని మనిషి ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త! మీకూ ఇలా జరగొచ్చు.. ఇదో కొత్త రకం మోసం
ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు పట్టుదలతో ఉండగా.. ఉత్సవాలను ఎట్టి పరిస్థితుల్లో భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే వాహన తనఖీలు చేపట్టారు. ప్రస్తుతం కాల్పుల అనంతరం.. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నెల 21 నుంచి వారం పాటు జరుపుతున్నట్లు మావోయిస్టులు పిలుపినిచ్చారు. అయితే వారోత్సవాలను భగ్నం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వచ్చే రాకపోకలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానితుల గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. డ్రోన్ల ద్వారా తనిఖీ చేస్తున్నారు.
మరోపక్క ఆవిర్భావ వారోత్సవాలను ఏజెన్సీలోని ప్రతి గూడేనికి తీసుకెళ్లాలని, ఆదివాసీలను పెద్ద ఎత్తున సమీకరించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్న మావోయిస్టు నాయకత్వం.. భారీ కసరత్తు చేసింది. వారం ముందు నుంచే ఎక్కడికక్కడ కరపత్రాలను అంటించారు. మావోయిస్టు పార్టీ ఉద్యమ తీవ్రతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు చేసుకుంది.
Also Read: Kothagudem: రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం