By: ABP Desam | Updated at : 13 Jul 2022 01:02 PM (IST)
పోలవరం గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల
Polavaram Floods : పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో బిగించిన గేట్లను తొలి సారి ఆపరేట్ చేశారు. పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పని చేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా అన్నీ ఒకే సారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి. సాధారణంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ గేట్లు నిర్వహణలో బాలరిష్టాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. స్పిల్ వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తయ్యాయి. గేట్లను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో అందులోనూ హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు.
రికార్డు స్థాయి వరద వచ్చినా తట్టుకునేలా గేట్ల నిర్మాణం
మొత్తం 48 గేట్లన్ని ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది.ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్దంగా ఉంచారు. స్పిల్ వే లో గతేడాది వరదల సమయానికే 48గేట్లకు గానూ 42రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు,వాటిని ఎత్తడానికి అవసరమైన 84హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు. అదే విధంగా 24పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు లో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజి లెవల్ లో రివర్ స్లూయిజ్ గేట్లు ఉంటాయి.
బాలారిష్టాలు లేకుండానే గేట్ల ఆపరేటింగ్
మొత్తం 10రివర్ స్లూయిజ్ గేట్లు,వాటికి ఒక్కో గేటుకు రెండు చొప్పున 20హైడ్రాలిక్ సిలిండర్లు,వాటిని ఆపరేట్ చేయడానికి 10 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. స్పిల్ వే దగ్గరకు వచ్చిన వరదను ముందుగా రివర్ స్లూయిజ్ గేట్ ద్వారానే విడుదల చేస్తారు. వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈగే ట్ల ద్వారానే విడుదల చేశారు. రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజి ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు త్రాగు,సాగునీరు అందించడానికి ఈగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు. పోలవరం స్పిల్ వే లో అమర్చిన 48రేడియల్ గేట్ల ద్వారా 50లక్షల క్యూసెక్కు ల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేయడం జరిగంది.చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేవిధంగా డిజైన్ చేస్తే పోలవరం ప్రాజెక్టు లో మాత్రం 50లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని విడుదల చేసేవిధంగా రూపొందించారు.
స్టాప్ లాగ్ గేట్ల వ్యవస్థ కూడా రెడీ !
వందేళ్ళలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారు. రేడియల్ గేట్లు ఆపరేట్ చేసే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా లేదా గేట్లకు ఏవైనా అడ్డుపడినప్పుడు ముందుగా స్టాఫ్ లాగ్ గేట్లను దించి అడ్డంకులను,లేదా సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆతరువాత రేడియల్ గేట్లను ఆపరేట్ చేస్తారు. దీనికోసం పోలవరం ప్రాజెక్టులో 5సెట్ల స్టాఫ్ లాగ్ ఎలిమెంట్స్ ను సిద్దంగా ఉంచారు. ప్రస్తుతం ఈస్టాఫ్ లాగ్ గేట్లు కూడా పూర్తి స్దాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్లనుండి 15లక్షాల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుంది.
Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత
YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ
నేను పార్టీ మారడంలేదు-వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ
CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్
Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్లోగా రండి: CJI
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !