అన్వేషించండి

PM Modi Oath Ceremony: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం - టీడీపీ, జనసేన నేతలకు అగ్రపీఠం

Modi Oath Taking Ceremony: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారికి బీజేపీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

PM Modi Oath Ceremony : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయగా..  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. 2019లోనూ రెండో సారి ఎన్డీయే ఘన విజయంతో రెండో సారి ప్రధాని అయ్యారు.  2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు.  ఢిల్లీలో మోడీ సహా కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి సహా 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తదితరులు ఉన్నారు.

మిత్రపక్షాలకు ప్రాధాన్యం
18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా.. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకు మొత్తం 293 సీట్లతో మెజారిటీ సాధించింది.  పాత మంత్రివర్గంలోని 22 మంది ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో కొత్త క్యాబినెట్లో చాలా మంది కొత్త వాళ్లకు చోటు కల్పించారు. సంకీర్ణ సర్కార్‌ క్యాబినెట్‌లో మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు కూడా భాగం అయ్యారు. ఎన్డీయే 3.0లో టీడీపీ, నితీష్ పార్టీ జేడీయూ కీలకంగా మారాయి.

బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఆ పార్టీ ప్రతినిధులకు ప్రాధాన్యత పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి క్యాబినెట్లో స్థానం లభించింది.  తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు క్యాబినెట్ బెర్త్‌ దక్కింది. మోడీ నివాసంలో వీరంతా తేనీటి విందుకు హాజరయ్యారు. 

క్యాబినెట్ లో కొత్త ముఖాలు
ప్రభుత్వంలో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వారే. ఎన్డీయే కూటమి మిత్ర పక్షాలైన టీడీపీకి చెందిన రామ్‌మోహన్‌ నాయుడు, చంద్రశేఖర్‌ పెమ్మసాని, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జేడీయూ నుంచి లాలన్‌సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, శివసేనకు చెందిన ప్రతాప్‌రావు జాదవ్‌తో పాటు ఎల్‌జేపీకి చెందిన చిరాగ్‌ పాశ్వాన్‌, హెచ్‌ఏఎంకు చెందిన జితన్‌రామ్‌ మాంఝీ, జేడీఎస్‌కు చెందిన హెచ్‌డీ కుమారస్వామి, జయంత్ చౌదరి, ఆర్‌ఎల్‌డీకి చెందిన రాందాస్ అథవాలే, ఆర్‌పీఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నా దళ్‌కు చెందిన అనుప్రియ పటేల్, బీజేపీ కి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ కుమార్, రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా కేంద్ర మంత్రి మండలిలో కొత్తగా చేరనున్నారు.

PM Modi Oath Ceremony: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం - టీడీపీ, జనసేన నేతలకు అగ్రపీఠం  
 
ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 
ఇక ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి ఎన్డీయే మిత్రపక్షాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కు, నితీష్ కుమార్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.  2024 ఎన్నికల్లో ఏపీలో భారీ విజయం సాధించిన చంద్రబాబు.. కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కూడా అత్యంత కీలకంగా మారారు.  బీజేపీ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను  మోదీ కూర్చొనే లైన్లోనే ఉండటం అందరినీ ఆసక్తిగా చూసేలా చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ల ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన వారంతా సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget