AP fake liquor scam: ఏపీ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు మరో షాక్ - ప్రధాన నిందితుడితో ఫోటోలు వైరల్ !
Jogi Ramesh: ఏపీ నకిలీ లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడితో జోగి రమేష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆయనను ఎప్పుడూ కలవలేదని జోగి రమేష్ చెబుతున్నారు.

AP fake liquor scam Jogi Ramesh Photos: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో జరిగిన నకిలీ మద్యం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు వీడియోలో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశానని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. జోగి రమేష్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు . తాను జనార్ధన రావును ఎప్పుడూ కలవలేదని, ఈ వీడియో బలవంతంగా తీయించినదని పేర్కొన్నారు.
తర్వాత జనార్దన్ రావుతో.. మాజీ మంత్రి చేసిన వాట్సాప్ చాట్ వైరల్ అయింది. అయితే అది ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాజాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు. జగన్మోహన్ అనే వ్యక్తులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఎప్పుడూ కలవలేదని జోగి రమేష్ చెబుతున్నారని..ఈ ఫోటోలేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
నకిలీ మద్యం కేసు నిందితులతో జోగి రమేష్.
— Swathi Reddy (@Swathireddytdp) October 18, 2025
నకిలీ మద్యం కేసులో నిందితులు జనార్ధనరావు, అతని సోదరుడు జగన్మోహన్ రావులు ఎవరో నాకు తెలియదు అని బుకాయించిన జోగి రమేష్ ఈ ఫోటోలతో అడ్డంగా దొరికిపోయాడు.. pic.twitter.com/ulGXZ0bz5G
ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులు ఉన్నారు, వీరిలో 14 మందిని అరెస్ట్ చేశారు. స్కామ్ మాజీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని, కానీ ప్రస్తుత టీడీపీ-ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొనసాగించారని జనార్ధన రావు ఆరోపించాడు. ఏప్రిల్‌లో జోగి రమేష్ తనను సంప్రదించి, నకిలీ మద్యం తయారీ పునఃప్రారంభించాలని సూచించారని, ఇబ్రహీంపట్నంలో ప్రారంభించాల్సిన యూనిట్‌ను తంబళ్లపల్లికి మార్చాలని ఆదేశించారని చెప్పాడు. రమేష్ ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని, కానీ తర్వాత విడిచిపెట్టారని ఆరోపించాడు. రమేష్ సూచనల మేరకు మీడియాకు లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యమని పేర్కొన్నాడు.
జనార్దన్ రావు ఎవరో నాకు తెలీదు ___ జోగి రమేష్
— Yash (@YashTDP_) October 18, 2025
నకిలీ మద్యం కేసు నిందితులతో జోగి రమేష్.
నకిలీ మద్యం కేసులో నిందితులు జనార్ధనరావు, అతని సోదరుడు జగన్మోహన్ రావులు ఎవరో నాకు తెలియదు అని బుకాయించిన జోగి రమేష్ ఈ ఫోటోలతో అడ్డంగా దొరికిపోయాడు _______😀😀
Waiting for Jogi’s arrest.… pic.twitter.com/0hI4K1hDgf
జోగి రమేష్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు మరియు తనకు స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. "నాకు ఈ కేసుతో ఒక్క లింక్ కూడా ఉందని చంద్రబాబు నాయుడు నిరూపిస్తే, ఏ శిక్షకైనా సిద్ధం" అని అన్నారు. తాను లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమన్నారు. "జనార్ధన రావు భార్య, పిల్లలను బెదిరించి వీడియో తీయించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు" అని చెప్పారు. సీబీఐకి కేసు అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా విడుదలైన ఫోటోలపై జోగి రమేష్ ఇంకా స్పందించలేదు.





















