అన్వేషించండి

Perni Nani On pawan : 175 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనం - పవన్‌కు పేర్ని నాని ఆఫర్ !

175 సీట్లలో పోటీ చేస్తే పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అనబోమని పేర్ని నాని ఆఫర్ ఇచ్చారు. పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఆయన కూడా అదే స్థాయిలో మండిపడ్డారు.

Perni Nani On pawan :   పవన్ కల్యాణ్ బీజేపీతో తెగదెంపులు చేసేశారని తేలిపోయిందని వైఎస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది అంటే చంద్రబాబుతో కలిసి వెళ్లడమేనని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో లగ్నం చేసుకోవడానికి ముహుర్తం దగ్గర పడిందన్నారు. ఈ ముసుకు వెనుక చంద్రబాబుకు గులాంగిరీ ఉందన్నారు. తాము సోదరా అంటేనే అంత కోపం వచ్చిందని.. తమను ..నా కొడకల్లాలా అని పవన్ కల్యాణ్ అన్నారని విమర్శించారు. పవన్ ఏంటీ నీై బలుపు అని పేర్ని నాని ప్రశ్నించారు. మొత్తం 175 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనడం మానేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీలో గూండాలు లేరని పవన్ వెనుకే ఉన్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. 

175 స్థానాల్లో పోటీ చేయాలని పవన్‌కు పేర్ని నాని సవాల్ 

నిజంగా దమ్ముండి.. ప్యాకేజ్ స్టార్ వి కాకపోతే.. సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయాలి అని పేర్ని నాని సవాల్ విసిరారు. మరో పార్టీకి ఓటు వేయాలని అని పిలిచే వారిని ప్యాకేజీ స్టారే అంటారు అని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు మమల్ని కొడకుల్లారా అనేంత బలుపు ఉందా అంటూ ఫైర్ అయ్యారు. కాపులంతా మెజార్టీ సంఖ్యలో వైసీపీ వైపు ఉన్నారనే ఇలా పవన్ కడుపు మండిపోతోంది అన్నారు. నిజంగా 175 సీట్లలో పోటీ చేసి.. చంద్రబాబుకి దూరంగా ఉంటే.. అప్పుడు ప్యాకేజీ స్టార్ అని పిలవమంని.. వైసీపీ కాపు నేతలందరి తరపున తాను క్షమాపణ చెబుతానన్నారు పేర్ని నాని. 

చంద్రబాబుతో కలిసేందుకే  పవన్ తహతహలాడుతున్నారన్న పేర్ని నాని 

చంద్రబాబుతో చెట్టపట్టాలు వేసుకునేందుకు లగ్నం దగ్గర పడిందని..  సోదరా అంటే మీకు కడుపు మండితే..  మమ్మల్ని కొడకల్లారా అంటే కడుపు మండదా.. సన్నాసిన్నర సన్నాసి అంటూ ఫైర్ అయ్యారు. నాకు కులమే లేదని చెప్పిన శుంఠవి నీవే కదా అని ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబంపై దాడి చేసినప్పుడు ఎక్కడున్నావని ప్రశ్నించారు. దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ, వెంకయ్య సహా బీజేపీ నేతల్ని బూతులు తిట్టి, నాలుక తడి ఆరకుండానే ఆ పార్టీతో అంటకాగలేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని.. 25 మంది మంత్రుల్లో ఐదుగురు మంత్రులు కాపులేనని పేర్ని నాని తెలిపారు. 

కాపులు వైసీపీతోనే ఉన్నారన్న మాజీ మంత్రి 

కాపులు వైసీపీతోనే వున్నారని.. ఇకపైనా వుంటారని పేర్ని నాని స్పష్టం చేశారు. తనకు కులమే లేదని చెప్పింది నురు. మాకూ తిట్లు వచ్చని.. మేం తిట్టలేమా అంటూ పేర్నినాని మండిపడ్డారు. సీఎం జగన్‌ను నీ పార్ట్‌నర్ ఆఫీస్ నుంచి తిట్టించినప్పుడు నీకు నోరు పడిపోయిందా అంటూ నాని ప్రశ్నించారు. పవన్ తన ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను చంద్రబాబుకు అప్పగించేలా పనిచేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి వుంటున్నానని.. కానీ వారితో కలిసి ఉద్యమం చేయలేకపోతున్నానని పవన్ అన్నారని.. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా పవన్ కల్యాణ్ మాట్లాడారని పేర్నినాని ఎద్దేవా చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget