Pavan Kalyan : పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కొత్త వ్యూహం !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ... ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల పాటు డిజిటల్ ఉద్యమం చేయాలని నిర్ణయించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరింత దూకుడుగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే విశాఖలో బహిరంగసభ, అమరావతిలో నిరాహారదీక్ష చేసిన ఆయన .. ఇక ముందు డిజిటల్ ఉద్యమం చేయాలని సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలందరూ పార్లమెంట్‌లో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందు కోసం మూడు రోజుల పాటు డిజిటల్ ఉద్యమం నిర్వహించనున్నారు. 18, 19, 20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి.. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు @JanaSenaParty డిజిటల్ క్యాంపెయిన్ - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.#SaveVizagSteelPlant pic.twitter.com/wUVaqnQLIp
— JanaSena Party (@JanaSenaParty) December 17, 2021
Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?
ఇరవై రెండు మంది వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. అన్యాయం జరుగుతున్నా నోరు మెదపని ఎంపీలు ఎందుకని ఘాటుగానే విమర్శిస్తున్నారు. అయితే పార్లమెంట్‌లో మాత్రం ఏపీకి చెందిన ఎంపీలు అరకొరగానే స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని అసలు ఎవరూ పోరాటం చేయడం లేదు. కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించడం లేదు. దేశంలోనే ఎక్కువ ఎంపీలు ఉన్న టాప్ ఫైవ్ పార్టీల జాబితాలో వైఎస్ఆర్‌సీపీ ఉంది. అయినా ఆ పార్టీ ఎంపీలు .. బాధ్యత లేనట్లుగా ఉంటున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు @JanaSenaParty డిజిటల్ క్యాంపెయిన్ - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
— JanaSena Party (@JanaSenaParty) December 17, 2021
Video Link: https://t.co/o8t6sh10mY pic.twitter.com/SozJTeIlYy
Also Read: బాలయ్య ఇలాకాలో వైసీపీ నేతల డిష్యుం డిష్యుం! ఇలాగైతే కష్టమే..!
టీడీపీ ఎంపీలు ముగ్గురు ఉన్నారు. వారు కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సభను స్తంభింపచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో వారిపై ఒత్తిడి తేవడం ఒక్కటే మార్గమని జనసేన అధినేత నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యకర్తలను డిజిటల్ ఉద్యమం వైపుగా నడిపిస్తున్నారు.
జనసేన పార్టీ గతంలో రోడ్లను బాగు చేయాలన్న డిమాండ్‌తో ఇలాగే డిజిటల్ ఉద్యమం నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, గుంతలు తేలిన రోడ్లను జనసేన కార్యకర్తలు ట్వీట్ చేసి.. వాటిని ట్రెండింగ్‌లోకి తీసుకు వచ్చారు. తర్వాత శ్రమదాన కార్యక్రమం కూడా చేపట్టారు. ఆ తరహాలోనే ఇప్పుడు ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది . మరి జనసేన ఉద్యమానికి స్పందించి.. పార్లమంట్ సభ్యులు కనీసం ప్లకార్డులైనా పట్టుకుంటారేమో చూడాలి !
Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి