News
News
X

Pawan Kalyan: అన్ని విషయాలు తర్వాత చెప్తా - మురళీధరన్‌తో భేటీ తర్వాత పవన్ వెల్లడి

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ మురళీధరణ్ తో చర్చించినట్లు సమాచారం.

FOLLOW US: 
Share:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఏపీ బీజేపీ ఇన్‌చార్జి మురళీధరన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం (ఏప్రిల్ 4) మురళీధరన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా పవన్ కల్యాణ్ తో ఉన్నారు. వీరు మురళీధరన్‌తో కీలక చర్చలు జరిపారు. పవన్‌ కల్యాణ్ నిన్న కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మురళీధరన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. నేడు మళ్లీ మురళీధరన్‌తో పవన్‌ మరోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ మురళీధరణ్ తో చర్చించినట్లు సమాచారం. మురళీధరన్ తో సమావేశం అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు పవన్‌ కల్యాణ్ ను కలిసి, భేటీ గురించి మాట్లాడాలని కోరగా ఆయన తిరస్కరించారు. ఇతర బీజేపీ నేతలను కూడా కలవాల్సి ఉందని, వారిని కూడా కలిసిన తర్వాత అన్ని విషయాలు మీడియాతో చెప్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. నేడు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని సమాచారం.

Published at : 04 Apr 2023 12:37 PM (IST) Tags: Pawan Kalyan Janasena news Muralidharan Pawan Kalyan Delhi tour

సంబంధిత కథనాలు

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

టాప్ స్టోరీస్

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం