Pattabhi Maldives : మాల్దీవ్స్‌కు వెళ్లిన పట్టాభి ! ఎందుకంటే ?
టీడీపీ నేత పట్టాభి మాల్దీవ్స్‌కు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఎయిర్‌పోర్టు, విమానంలో ఉన్న ఫోటోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. దీనిపై టీడీపీ కానీ.. ఆయన కుటుంబసభ్యులు కానీ స్పందించలేదు.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులుఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులు అరెస్ట్‌లో నిబంధనలకు అతిక్రమించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన రోజు నుంచి పట్టాభి ఆజ్ఞాతంలో ఉన్నారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. ఎవరికీ అందుబాటులో లేరు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారన్న చర్చ ప్రారంభమయింది.
అయితే అనూహ్యంగా కొంత మంది కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ ఆయన ఎయిర్‌పోర్టు టు ఎయిర్‌పోర్టు మధ్యలో విమానంలో కూర్చున్న ఫోటోలతో సహా వైరల్ చేస్తున్నారు. ఆయన మాల్దీవ్స్ వెళ్లిపోయారని అంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై అటు టీడీపీ వర్గాలు కానీ.. ఇటు పట్టాభి కుటుంబసభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే పట్టాభి ఒక్కరే వెళ్లారని ఆయనతో పాటు కుటుంబసభ్యులెవరూ లేరని ఫోటోలను బట్టి తెలుస్తోంది.
Also Read: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్
కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ప్రాణానికి ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతోనే ఆయన వెంటనే ఆజ్ఞాతంలోకి వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బెయిల్ వచ్చిన రోజున రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ ముప్పు ఉందన్న సమాచారంతో ఆయన వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆయనతో పాటు వస్తున్న వాహనాలన్నింటినీ నిలిపివేశారు. కానీ పట్టాభి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Also Read : ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి
పట్టాభి విదేశాలకు వెళ్లడానికి చట్టపరమైన ఆటంకాలు ఏమీ లేవు. ఆయనపై విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేంత కేసులు ఏమీ లేవు. ఆయన తన ఇష్టానికి ఎక్కడికైనా వెళ్లగలరు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఆజ్ఞాతంలో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఆసక్తికరంగా మారింది.
Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?