Minister Ambati Rambabu : గెలిచిన మూడేళ్లకు గుర్తొచ్చామా?, మంత్రి అంబటికి నిరసన సెగ
Minister Ambati Rambabu : పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగతగిలింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలు తమ సమస్యలపై మంత్రిని నిలదీశారు.
Minister Ambati Rambabu : పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. రాజుపాలెం ఎస్సీ కాలనీలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటిని మహిళలు నిలదీశారు. సంక్షేమ పథకాలు రావటంలేదని మంత్రిని ప్రశ్నించారు. పింఛన్లు రావటంలేదని, ధరలు పెరిగాయని మంత్రిని నిలదీశారు. మహిళలపై మంత్రి అంబటి అసహనం వ్యక్తం చేశారు. మహిళలు ఆగ్రహించటంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడేళ్ల తర్వాత గుర్తుకు వచ్చామా అంటూ మహిళలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలపై నిలదీత
మంత్రి అంబటి రాంబాబుకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో రాజుపాలెం గ్రామానికి వెళ్లిన మంత్రిని మహిళలు సమస్యలపై నిలదీశారు. గెలిచిన మూడేళ్లకు గుర్తొచ్చామా అని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయండంతో అంబటి అసహనం వ్యక్తంచేశారు. అయితే మహిళలు తిరగబడడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నిరసన సెగ
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగతగిలింది. పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి అంబటి సోమవారం పర్యటించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లు అయిన రాలేదని ఓ దివ్యాంగురాలు మంత్రిని నిలదీశారు. పక్కనే ఉన్న అధికారులు వాళ్ల ఇంటికి వెళ్లి నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్న కారణంగా పింఛన్ మంజూరు కాలేదన్నారు. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబటి రాంబాబు కాదు డాంబికాల రాంబాబు! ఇప్పుడు పారిపోయి వచ్చారు. ఈసారి వెళ్తే అంబాడుతూ రావాలేమో అంబటి సార్! మూడేళ్ళు మీరేం చేశారో బాగా తెలిసిందా?#JaganPaniAyipoyindhi pic.twitter.com/kqXLc7bBrB
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2022
మంత్రిపై విమర్శలు
అక్కడికి సమీపంలో బుల్లబ్బాయి అనే మరో వ్యక్తి మంత్రిపైనా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. దీంతో అక్కడి పరిస్థితి చూసి మంత్రి మరో వీధికి వెళ్లిపోయారు. అనంతరం రాజుపాలెంలోనే మరో వీధిలో మంత్రి అంబటి పర్యటిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రోడ్లు కావాలని అడగగా, ప్రభుత్వం నుంచి ఆ వ్యక్తికి వచ్చిన పథకాలను తెలిపారు.
స్పందించిన మంత్రి
ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు ఓ వీడియో విడుదల చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు తనపై విమర్శలు చేశారన్నారు. కొంతమంది కావాలనే మహిళలకు చెప్పి తనపైకి ఉసిగొల్పారన్నారు. అది చాలా చిన్న సంఘటన అని, వాటిని పెద్దవి చేసి చూపించారని మంత్రి ఆరోపించారు.
Also Read : Buggana Rajendranath: మంత్రి బుగ్గన ముఖంపైనే దురుసుగా మాట్లాడిన మహిళ! సొంతూర్లోనే, వీడియో వైరల్