Collectors Couples : జంట కలెక్టర్లు -ఎస్పీలు ! అదృష్టమంటే వారిదే
దంపతులకు పక్క పక్క జిల్లాలకు కలెక్టర్లుగా అవకాశం లభించింది. దీంతో ఒకే కలెక్టర్ బంగ్లా నుంచి రెండు జిల్లాల పాలన జరుగుతుందని అనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. అంతా కొత్తకొత్తగా ఉంది. అధికారులకూ అలాగే ఉంది. కొంత మందికి మాత్రం ఇంకా కొత్తగా ఉంది. భార్యభర్తలు ఇద్దరికీ కలెక్టర్ పోస్టింగ్‌లు వచ్చాయి. అదీ కూడా పక్కపక్క జిల్లాల్లో . అప్పటి వరకూ ఉన్న జిల్లాలనే విడదీసిన తర్వాత జిల్లాలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇలాంటి జంట కలెక్టర్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు- పాత వివాదాలు, ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి గళాలు
బాపట్ల, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాలను రెండు జిల్లాలు చేశారు. బాపట్ల లోక్‌సభలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉండేవి. ఇప్పుడు ప్రకాశం జిల్లాకు.. కలెక్టర్‌గా దినేష్ కుమార్ నియమితులయ్యారు. బాపట్ల జిల్లా కలెక్టర్ గా విజయను నియమించారు. వీరిద్దరూ భార్యభర్తలే. లు భార్యాభర్తలు. వీరు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. విశేషం ఏమిటంటే ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా భార్యభర్తలే . మలికా గార్గ్ ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆమె భర్త వకుల్ జిందాల్ తాజాగా పొరుగునే ఉన్న జిల్లా ఎస్పీగా పోస్టింగ్ పొందారు.
ఏపీలో అవతరించిన కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - ప్రారంభించిన సీఎం జగన్
కాకినాడ జిల్లాకు కలెక్టర్‌గా కృతికా శుక్లాను ప్రభుత్వం నియమించింది. ఈమె 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ దిశ చట్టం – 2019’ అమలుకు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్‌గా పోస్టింగ్ దక్కించుకున్నారు. కృతికా శుక్లా భర్త హిమాన్షు శుక్లా కోనసీమ జిల్లాకు కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన కూడా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మొన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా Gఉన్నారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, కీలక ప్రకటన విడుదల
జిల్లాలు ఎక్కువ కావడంతో జూనియర్ అధికారులకు కూడా కలెక్టర్ పోస్టింగ్‌లు లభించాయి. అయితే ప్రభుత్వం ఒకే రాష్ట్రం క్యాడర్‌లో ఉన్న దంపతులైన అధికారుల్ని దగ్గరగా ఉంచడానికే నిర్ణయించింది. ఈ మేరకు వారికి పోస్టింగ్‌లు పక్క పక్క జిల్లాల్లోనే ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సౌకర్యాల ప్రకారం చూస్తే.. బాపట్లలో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు ఇప్పటికిప్పుడు కొత్తవిసిద్ధం చేసుకోవాల్సిన పని లేదు. అలాగే.. కోనసిమ జిల్లాకూ అంతే. కాకినాడ కలెక్టర్ బంగ్లాలోనే కోనసిమ కలెక్టర్ కూడా ఉంటారు.