అన్వేషించండి

Ongloe Crime News: దళిత మహిళపై దాడి, వివస్త్రను చేసి కాళ్లూ చేతులు కట్టేసి దాష్టీకం - అసలేం జరిగిందంటే? 

Ongloe Crime News: స్వాతంత్ర దినోత్సవానికి ముందురోజే ఓ దళిత మహిళను దారణంగా వేధించారు. కాళ్లూ చేతులు కట్టేసి వివస్త్రను చేశారు. ఆపై కళ్లల్లో, ఒంటిపై కారం చల్లి కత్తులతో దాడి చేసి.. పెట్రోల్ చల్లారు.

Ongloe Crime News: దళిత కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లిపోయిందనే కోపంతో ఓ అమ్మాయి తల్లిదండ్రులు కిరాతకంగా ప్రవర్తించారు. తమ కుమార్తె వెళ్లిపోవడం పరువు తక్కువగా భావించిన ఆమె తల్లిదండ్రులు.. సదరు యువకుడి కుటుంబంపై తీవ్ర కోపం పెంచుకున్నారు. ఎలాగైనా సరే తమ కూతురును ఇంటికి రప్పించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే భర్త చనిపోయి ఇంటివద్దే ఉంటున్న యువకుడి సోదరిపై దాడి చేయాలని నిర్ణయించుంకున్నారు. అర్ధరాత్రి వారి ఇంటికి చేరుకొని ఆమెపై దాడి చేశారు. వివస్త్రను చేసి కాళ్లూ చేతులూ కట్టేశారు. ఆపై కత్తులతో దాడి చేసి ఒంటిపై కారం పోసి విపరీతంగా హింసించారు. అలాగే నిర్బంధించి సజీవ దహనం చేయబోయారు. కానీ స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగా.. భయపడిపోయిన దంపతులు ఆమెను వదిలేశారు. 

అసలేం జరిగిందంటే..?

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే ఇంటి పెద్ద చాలా కాలం క్రితమే చనిపోగా... తల్లే కష్టపడి వారిని పెంచి పెద్ద చేసింది. కూతురుకు పదేళ్ల క్రితమే పెళ్లి కూడా చేసింది. కానీ ఆమె భర్త రెండేళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత నుంచి నర్సుగా శిక్షణ తీసుకున్న సదరు యువతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. అయితే ఈమె సోదరుడు.. బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు. మార్చి నెలలో గ్రామంలోంచి వెళ్లిపోయిన పెళ్లి చేసుకున్నారు. కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయి.. ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం పరువు తక్కువగా భావించిన యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ కలిసి యువకుడి ఇంటిపై దాడి చేశారు. కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారు. తమ కూతురను తెచ్చి తమకు అప్పగించకుంటే సజీవంగానే చంపేస్తామంటూ బెదిరించారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన పుల్లమ్మ దంపతులు.. సదరు కుటుంబంపై మరింత కోపం పెంచుకున్నారు. 

ఈక్రమంలోనే స్వాతంత్ర దినోత్సవానికి ముందురోజు అంటే సోమవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో వారి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు తల్లిని చూసేందుకు వచ్చిన బాధితురాలు.. అర్ధరాత్రి కుళాయి నీరు విడవడంతో పట్టుకోవడానికి వీధిలోకి వచ్చింది. అప్పటికే అక్కడకు చేరుకున్న బ్రహ్మారెడ్డి అతని భార్య పుల్లమ్మై ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివస్త్రను చేసి కత్తులతో దాడి చేశారు. ఆపై ఒంటిపై, కళ్లలో కారం పొడి చల్లారు. కోపం చల్లారక పోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ అప్పటికే బయటకు వచ్చి ఈ తతంగాన్ని చూసిన పలువురు స్థానికులు.. 100 డయల్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇలా సదరు యువతి సజీవ దహనాన్ని ఆపి.. ఆమె ప్రాణాలను కాపాడారు. 

బ్రహ్మారెడ్డి ఇంట్లో బందీగా ఉన్న మహిళను బయటకు తీసుకొచ్చి ఆమె కాళ్లకు, చేతులకు ఉన్న కట్లను విప్పారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు అపహరణ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బ్రహ్మారెడ్డిని, అతడి భార్య పుల్లమ్మను అరెస్ట్ చేశారు. వైద్య శాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శిక్షణ ఐపీఎస్ అధికారిణి అంకిత సురానా మహవీర్ మంగళవారం రోజు పరామర్శించిన ధైర్యం చెప్పారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget